ఆలోచన నీ వాసనేస్తూ..

అక్షరాలను ఇక్కడే పాతిపెట్టాను.
గుండెల్ని మెలితిప్పే నీ ఆలోచన ఉందే
ఉదయ, సాయంత్రాల కాంతిని తినేస్తుందది
ఎండవేడికి అరికాలు బొబ్బలెక్కి మండుతున్నాయి.
ఇప్పుడు కూడా నువ్వు నాతో నడుస్తున్నావు
ఆలోచనలు నీ వాసనేస్తూంటే
పేజీల మధ్య  నెమలి ఈకను తడిమినట్టుగా నీ జ్ఞాపకాలు
చివరి పేజీ వరకూ తిరగేసి
నాలోని నిన్ను తడుముతూ
ఎన్నాళ్ళుగా పేరుకున్న చీకటి ఇది

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గమ్యం తెలియని పాత్రల పయనం "హిమజ్వాల"

అల్లం శేషగి రావు కథ "చీకటి"

పంచాయతీ మెట్లు