నాకు నేనే ఎదురైతే...



నాకు నేనే ఎదురైతే
చిట్టిపాదాల సవ్వడిని, అమాయకపు
చిరునవ్వుని గుండెలకు అదుముకుని నాతో తీసుకెళతాను.

అప్పుడు 
గోదావరి నవ్వినట్టు 
జలపాతాలను వేళ్ళతో తాకినట్టుగా
ఉంటుందేమో
ప్రేమను భుజాన వేసుకొని పోతుంటానేమో

కవ్వింపుగా చూసే కళ్ళలో వేల కొంటెదనాల్ని
మోస్తూ 
ఏ వలపు వలలో చిక్కక.. మోహరింపుగా
పోతున్న నన్ను నేనూ చూస్తుంటాను.

కాంక్షను వదిలి ఆరాధనలో పడిన నన్ను చూసి నవ్వుకుంటాను.
రేపటి ఉదయాలను, సాయంత్రాలను కలగంటాను.

ఊహల లోకంలో తేలిపోతున్న నాకు, వాస్తవ ప్రేమలను చూపిస్తాను.

ఇక్కడ ఇరుకైపోతున్న ప్రేమలను ఏకరువు పెడతాను.
అప్పుడు నీ అమాయకపు అంచనాలు తప్పుతాయేమో..

కలలు చెదిరి 
నిరాశతో దుఃఖం ఆవరిస్తున్న నన్ను చూసి
జాలిపడతాను.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గమ్యం తెలియని పాత్రల పయనం "హిమజ్వాల"

అల్లం శేషగి రావు కథ "చీకటి"

పంచాయతీ మెట్లు