ఎన్ని వేల క్షణాలో అలా..




 ఎన్ని వేల క్షణాలో అలా..

నువ్వు వస్తావని వాకిలికి 

ఎదురుచూపులు తగిలించాను

ఒక్క క్షణం

నా పెదవులను పండించిన

నీ నవ్వు మీద బరువుగా 

వాలతాను

వానాకాలం ముసురల్లే 

నన్ను చుట్టుకున్న 

నీ చేతుల్లో మందారాలు 

పూస్తాయి..

మాటలన్నీ వడ్డించాకా

నువ్వు పెట్టే ముద్దు 

కొసరు నాకు

అప్పుడే

కమ్మని మట్టి వాసనేస్తూ కవ్వింపుగా

నాతో వాదులాడతావు

ఆ సందడిలోనే

వానంతా వెలిసి చినుకుల 

ముత్యాలు రాలినట్టు

ఎంత అందమో..

అంటుకుంటుంది నిన్ను

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గమ్యం తెలియని పాత్రల పయనం "హిమజ్వాల"

అల్లం శేషగి రావు కథ "చీకటి"

పంచాయతీ మెట్లు