ప్రియా...! ఎంత చిత్రం!!

 


ప్రియా...!

ఎంత చిత్రం!!

ఉదయాలు పచ్చని తోటలో 

సంధ్యలో ఎరిగే పక్షుల వెంట

చీకటి రాత్రుళ్ళ వెంట

విహరించే కలలు నావి.

కోర్కె చిగుళ్ళ మాటున 

కోయిల బాకాల వెంట

ఆ మబ్బుల్లో 

మేఘం నీ రూపు దిద్దుకుంది.

నిన్ను వొదలక వెంబడిస్తూ..

ఈ దూరమెంతో భారంగా ఉంది.

హృదయం మీద

ఎంత తుడిచినా నీ గురుతులు

చెరగడం లేదు.

గుండె బరువు పొదలమాటున 

సెలయేరు హొయలనలముకొని 

నీదాకా పరుగందుకుంది.

చీకటి తెరల మాటున 

ఈ మిసిమి మీగడల 

సొగసునందుకుని..

చల్లగాలికి తేలి ఊగే 

గడ్డిపొదల శబ్దాన్ని

నీ అడుగుల చప్పుడు 

ఎత్తుకుపోయింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

పంచాయతీ మెట్లు

గమ్యం తెలియని పాత్రల పయనం "హిమజ్వాల"

అల్లం శేషగి రావు కథ "చీకటి"