Friday, 23 July 2021

పసితనం..




అమ్మ కొంగు పట్టుకుని

జోల పాటకు జోగుతూ

ఊగే సంగీతం లాలి పాటై

నిద్ర పుచ్చుతుంది.

గిట్టల చప్పుడుతో

చెదిరిన ఆవులమందను చూసి

పరవసించి పాడేది మోగే పిల్లనగ్రోవి

తూలుతున్న నిద్ర ముఖాలకు

నాన్న తెచ్చిన మిఠాయి పొట్లం

తాయిలం

అమ్మవారి ఊరేగింపుకు 

అతిథిగా వచ్చేది

రథచక్రాలకు హుషారు నింపేదీ

ఈ బుడంకాయలే

నులకమంచం చుట్టూ చేరి

ఆకాశ రహస్యాల్ని చేదిస్తూ 

తలలూపే 

బుల్లి శాస్త్రవేత్తలు వీళ్ళు

గుడిలోని దీపాలు చీకటిని

ఎత్తుకుపోయిన రోజు 

అగరబత్తీల వాసనల మధ్య 

చక్రపొంగలి నైవేద్యం 

దోసిళ్ళకు చాలనంత

ఇసుక తిన్నెల మీద

ఆటలాడి అలసిపోయి 

ఇల్లు చేరిన పసితనం ముందు

పడవంత సంతోషాన్ని 

రెక్కలాడిస్తూ 

పిచ్చుక మనసు గాలిలో

గిరికీలు కొడుతుంది.

No comments:

Post a Comment

నీలోకి ఒలికిపోయాననీ..

ఈరోజుకి రాసే ప్రేమలేఖ ఇది..  కొన్నిసార్లు అనిపిస్తుంది.  నేను నీలోకి ఒలికిపోయాననీ..  నీలోకి వచ్చి చేరాకా హృదయంలోని నిశ్శబ్దానికి...