ఏటి ఒడ్డున




 ఏటి ఒడ్డున ఎన్ని వేల

అడుగులో నావి..
ఎన్నివేల గురుతులో మనవి.
ఆషాడపు ఛాయతో
ఎర్రని సంధ్య దీపపు
వెలుగులో నీ కోసం ఎన్ని
ఎదురుచూపులో ఖర్చు చేసాను..
ఏదీ..నువ్వు రావే.
నీడన నిలబడిన శ్రావణాన్ని
చామంతుల సొగసులు
అరువిచ్చి పొమ్మన్నాను.
గలగల గాజుల మోతలతో
కాలి మువ్వలు సందడిలో
కనిపిస్తుందా నా నిరీక్షణ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గమ్యం తెలియని పాత్రల పయనం "హిమజ్వాల"

అల్లం శేషగి రావు కథ "చీకటి"

పంచాయతీ మెట్లు