ఉదయ కాంతిలో ..


 

ఆషాడ గొరింట పూసింది

ఉదయ కాంతిలో వెలిగే
ముగ్ద మందారపు సొగసు దానిది
విచ్చుకున్న పూల వయ్యారాలతో
పూరేకుల వాన
బొట్లు బొట్లుగా పూలు
చెట్ల ఆకుల్లా రాలిపడే అక్షింతలు
నీకోసమే నిరీక్షణ
నీ మాటలన్నీ తలపుకొచ్చి
లేత బుగ్గలు
చంద్రకాంతలంత అందాన్ని
పులుముకుని మెరుస్తున్నాయి.
సెలయేరు పరవళ్ళు తొక్కుతూ
నీ ప్రేమంత ఆత్ర పడుతుంది.
ఆకాశాన చుక్కలన్నీ వెన్నెట్లో
కబుర్లాడుతూ
మన ఊసులే చెప్పుకుంటున్నాయి
ఎంత మధురమైన సవ్వడో
నా హృదయాన్ని తాకుతోంది
మూసి ఉన్న కనురెప్పలలో
కన్నీటి ప్రవాహాన్ని దాచుకున్నాను.
నా గుండె లయలో దాగి
నీ అడుగులన్నీ కలిపి
ఇటుగా రా
ఈ మనసు కాళీని పూరించు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గమ్యం తెలియని పాత్రల పయనం "హిమజ్వాల"

అల్లం శేషగి రావు కథ "చీకటి"

పంచాయతీ మెట్లు