సుఖాలు కొందరివి, దుఃఖం కొందరిది అయితేనేం జీవితం, కాలం సాగిపోతూనే ఉంటుంది. ఎక్కడా తేడాలేకుండా నిన్నటి రోజులా.. మొన్నటి సాయంత్రంలా.. కాలం కరిగిపోతూనే ఉంటుంది. అదే నెలవంక అవే నక్షత్రాలు, అదే ఆకాశం అన్నీ వాటి పని చేసుకుని వెళిపోతుంటాయి. రోజులో చాలా వచ్చిపోతుంటాయి. ఆలోచనల పుట్టగా, వెర్రిగా వెకిలిగా, చాలా విసుగుతో నిండిన సమయాలు, గురుతుంచుకోనేందుకు పెద్దగా ఏం లేని సందర్భాలు.
కదల్లేని శరీరాన్ని పట్టుకుని వేధించే చీమలు
పుట్టలుగా రొద చేస్తూ కదులుతున్న తేనెటీగలు
గుంపులుగా పరుగందుకున్న ఎలుకలు
మెలికలు తిరిగే పాములు... ఎత్తైన అంతస్తులపై నాకోసం ఎదురు చూసే చావు
ఎన్ని భయాలో ఎన్ని జుగుప్సలో.. ఇవన్నీ పుట్టింది ఈ మెదడులోనే..
జరిగిపోతున్న కాలంలో నేనో గులక రాయిని. చూస్తూ ఉన్నాను. జరిగేదంతా. ఏదైనా వింతగా కొత్తగా ఉంటుందేమోనని.... ఈ రోగాలు, రొష్టులు కాకుండా మరేదైనా నా చెవిన పడుతుందేమోనని.. నవ్వే స్నేహాలు, నవ్వించే పరిసరాలు ఎదురవుతాయేమోనని ఏదీ.. ఎక్కడా?
వెతుకుతున్నాను.. నిరాశతో
అవన్నీ నటనలే.. ఉత్త నటనలే.. ఎవరొస్తారు.. నీ దుఃఖాన్ని పంచుకునేందుకు
అన్నీ వెర్రి మొర్రి ఆశలు.. ఉత్త బూటకాలు
పట్టలేని ఆనందంలో పరవశించే రోజుల్లో కన్న కలలన్నీ వెక్కిరిస్తూ,,
వేసిన ముగ్గుల వంక చూస్తూ.. పండిన గోరింటాకు చేతుల్ని చూస్తూ మురిసిపోయిన రోజులు వెక్కిస్తున్నాయి అరిగిన జ్ఞాపకాలై..
చిరునవ్వును పంచిన సమయాలు ..
వాస్తవం వైపు ప్రయాణం కట్టిన కాలాలు
నిన్నటిలా ఈరోజులేదని, రేపు ఎలా ఉండబోతుందోనని, అన్నీ ఆలోచనలే
ఉత్త ఆలోచనలు, పట్టి పీడించే వ్యథ. ఒలకబోసికుని, ఎత్తుకుని ఇప్పటికీ అలాగే..
No comments:
Post a Comment