Sunday, 4 July 2021

చూడు..





 చూడు..మళ్ళీ కాళీ చేతులు వేలాడేసుకుని, కళ్ళు వాలేస్తూ నన్ను నేను వెతుక్కుంటున్నాను. నా చుట్టూ భయం. ఈ ఒంటరి ఆలోచనల్లో మళ్ళీ మళ్ళీ నువ్వే దారవుతావు. నన్ను హత్తుకుని, లాలించి చక్కటి అక్షరాలను నామీంచి పోస్తావు. ఎంత దయో నేనంటే...నీ పుస్తకం నా గుండెల మీద ఉందిప్పుడు.

అటక వైపు చూస్తూ నీ ఆలోచనలోనే మునిగి ఉన్నాను. మళ్ళీ నన్ను పూర్తిగా ఆవరించిన ఒంటరితనం. నీ కబుర్లే ఈ దిగులు నుంచి బయట పడేస్తాయని లోన ఆశ.

నమ్మకం గా ఎప్పుడూ లేను నీతో..కదూ.. నీ కథలన్నీ ఇక్కడ బూతులంటారు. నీ అక్షరాలకు నాలాంటి ప్రేయసి ఉందని ఎందరికి తెలుసు..

ఈ నిరాశ నుంచే ఎన్నో ప్రశ్నలు..అవీ చిరాకు తెప్పిస్తాయి. ఒక్కోసారి అనిపిస్తుంది ఈ పురుగులకి, దోమలకి ఆత్మలుంటే ఎన్ని కష్టాలు పడేవాళ్ళమో..ప్రాణం పోగానే ఈ కళేబరాన్ని భరించలేము. వికృతం, అసహ్యం, భయంకరం..ఆకాశాన ఎగిరే పక్షులకి భూమి మీద మనుషులకు చావు ఒకే విధమైన ప్రక్రియ..

నాకన్నా ముందు తరాలలో పుట్టి చనిపోయిన మహామహులెందరో..వారి పాండిత్యం జ్ఞానం పంచభూతాల్లో కలిసిపోయింది. 

కానీ అన్నీ కలిసిపోయినా నీ ఈ అక్షరాలు ఉన్నాయి చూడు అర్థం చేసుకోవాలేగానీ యుగాలు గడిచినా ఈ జ్ఞానం కనుమరుగుకాదు. నా చేతుల్లో ఒదిగిపోయి నా మెదడులో దూరిపోయి..నన్ను సమస్తం ఆక్రమించి ప్రేమరాగాన్ని నింపావు. నీవే లేకుంటే ఈ ప్రేమ, విరహం, ఆరాధన ఎదుటివారి మీద చూపే దారే తెలిసేదికాదు. ఒక్క సారైనా నిజమైన మోహాన్ని, ప్రేమనూ చవి చూసేదాన్ని కాను. 

అదంతా నీ చలవే. అక్షరాలను సృష్టించిన ఆ సరస్యతికి కూడా అమర్చే నేర్పు తెలియదేమో..నీవంత నేర్పరివి.

No comments:

Post a Comment

నీలోకి ఒలికిపోయాననీ..

ఈరోజుకి రాసే ప్రేమలేఖ ఇది..  కొన్నిసార్లు అనిపిస్తుంది.  నేను నీలోకి ఒలికిపోయాననీ..  నీలోకి వచ్చి చేరాకా హృదయంలోని నిశ్శబ్దానికి...