గుబులు గుబులుగా..

 



వెచ్చని కౌగిలికి గుబులు
చీకట్లు అలమినప్పుడు..
ఎగిరే తూనీగతో నా క్షేమ
సమాచారం కట్టి పంపుతాను.
గాలివాటుకు చెట్ల కురులు
చెదరినప్పుడు..
అప్పుడే నీ దేహంలో
కలిసిపోతాను.
రాత్రి వేడి నిట్టూర్పుల
మధ్య కాలానికి జతై..
జడలోని మల్లె దండకు
దిగులుతో జవాబునౌతాను.
నిద్ర లేక శాంతి లేక
ఏకాంతం చెదరినప్పుడు
కొలనులో కలువనై
గుండెకు చుట్టుకుంటాను.
రోత లోకం తరిమినప్పుడు
నువ్వు రావని తెలిసి..
చీకటాకాశంలో వెలుగు చుక్కల
వెంట ఎగిరిపోతాను.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గమ్యం తెలియని పాత్రల పయనం "హిమజ్వాల"

అల్లం శేషగి రావు కథ "చీకటి"

పంచాయతీ మెట్లు