ఈ వెర్రితనం చూసి నవ్వినా పరవాలేదు..

 




ఈ వెర్రితనం చూసి నవ్వినా పరవాలేదు.. నీతో నాకున్న బంధం అలాంటిది మరి..ఏంచేయను. నిన్ను అణువణువునా నింపుకోవాలని చూస్తానా.. కొర్రమేనులా జారిపోతావు. 

నీ పుస్తకాన్ని ఎన్నిమార్లు కాకాపట్టానో తెలుసా! ఏదో తృప్తి.. నీతో గడిపిన క్షణాలకు మల్లే.. అనిర్వచనీయమైన ఆనందం. నా చేతుల్లో నలిగిన పుస్తకంగా నాకు అలవాటు నువ్వు.. 

ఇప్పుడు కొత్తగా ముస్తాబయిన పెళ్ళికొడుకుమల్లే నన్ను వెక్కిరిస్తున్నావు.. ఈ కొత్త పుస్తకంలో దూరి. తెల్లని కాగితాల్లో వెన్నెల ముద్దల్లే..నిండు జాబిలిలా🤗

ఏదైనా నువ్వు అలవాటుగా మారి వ్యసనంగా అవడం ముచ్చటే 😊

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గమ్యం తెలియని పాత్రల పయనం "హిమజ్వాల"

అల్లం శేషగి రావు కథ "చీకటి"

పంచాయతీ మెట్లు