ఇలా పెద్దాళ్ళంతా పిల్లల్ని కన్నట్టే.. బిడ్డలను
గురించి కలలు కూడా కనిపారేస్తారు. ఇక అవి సాధించడానికి నిరంతరం పోరాడాల్సిన పని
పిల్లలది. నేను దద్దమ్మల జాబితాలో చేరినా, ఏంటో నాన్నగారి నమ్మకం నా బిడ్డలు
రత్నాలని చెప్పడం మాత్రం మానలేదు. ఇదెక్కడి గోలరా దేవుడా అనుకునేదాన్ని. దానికి
తగ్గట్టు.. నా తరవాతది గొప్ప తెలివైంది. నిద్రలో కూడా పుస్తకం వదిలేది కాదు. ఐదో
తరగతిలోనే పదోతరగతి ఇంగ్లీషు పుస్తకాలు అవలీలగా చదివేసేది. సరే ఇక చిన్నతనంలో నాకు
అ ఆ లు రాని టైంలో అయితే.. అది నాలుగోతరగతి పుస్తకాలు చదివేసి అందరినీ ఔరా
అనిపించేది. ఇక తల్లితండ్రుల కల తీర్చే కులపుత్రి ఆమే అన్న ధీమాలో బతికేవాళ్ళు మా
పితామహులు.
ఈ ద్వారపూడి స్కూలుకి వచ్చాకా.. నా బండతనం
బయటపడినా మానాన్నగారు మాత్రం... ఏమే చిన్నది చూడు నీకన్నా పదకొండు నెల్లు చిన్నది... దానిలా కాకపోయినా బాగా చదవాలి నువ్వు అనేవాళ్ళు. మాట్లాడితే దానితోనే పోలిక... ఇక
నాకు దానిమీద కసి మొదలయ్యింది. దానికన్నా బాగా చదువుదామని మాత్రం కాదు. ఇది
వేరేది.
అదేమో నలుగురు తోబుట్టువులన్నమాటేగానీ.. మాతో
గడిపేది కాదు. మాట్లాడటం కూడా తగ్గించేసింది. చీటికీ మాటికీ మాతో మాట్లాడకుండా
శిక్షలు వేసేది. దానితో మాట్లాడాలని పెద్దగా ప్రయత్నించకపోయినా ఏదో వెలితిగా
ఉండేది. ఇక ఆ శిక్ష నుండీ మా అమ్మా నాన్నా కూడా తప్పించలేకపోయే వాళ్ళు. అంత
మొండిది. మాతో కాకుండా వేరేగా పడుకునేది. చదువుకునేది. కాస్త ఎదిగాకా వేరుగా వంట
కూడా చేసుకు తినేది. ఇక అదంటే కసికాకుండా ఏం పెరుగుతుంది.
దీనికి తగ్గట్టు నేను ద్వారపూడి వచ్చాకా కాస్త
జబ్బు పడ్డాను. రక్తం తగ్గిపోయి చాలా ప్రమాదంగా మారిపోయింది పరిస్థితి. చదువు
మాన్పించి అమ్మమ్మ ఇంటికి పంపేసారు. హమ్మయ్య ఈ ఎడాది చదువు పీడ లేదు అనుకుని హాయిగా కేబుల్ టీవీలో సినిమాలు చూస్తూ,
అమ్మమ్మ చేతి ముద్దలు తింటూ గడిపేసాను.
మళ్ళీ స్కూలు తీసారు. మానాన్న ఊరుకోడుగా.. నన్నూ,
బక్కదాన్ని ఒకే తరగతిలో వేసిపారేసాడు. ఏం
చేస్తాం. చిన్నదానితో కలిపి చదవాల్సిన పరిస్థితి వచ్చింది. క్లాసంతా దద్దమ్మలే
ఉంటే వేరే చెప్పడానికి ఏం ఉంటుంది. మళ్ళీ ఇందులో రెండు వర్గాలు. ఒకళ్ళు తెలివిగలవాళ్ళు
అందులో ద్వారపూడి ఊళ్ళోంచి వచ్చినవాళ్ళంతా ఉండేవాళ్ళు అంటే అందరికీ మెదళ్ళున్నాయని
కాదు. చదవగలరంతే.. ఆ జాబితాలో మా బక్కది చేరిపోయింది.
ఇక రెండో వర్గం చదువంటే ధ్యాస లేదుగానీ..
స్కూలుకి రావాలి..కాలక్షేపం చెయ్యాలనే బేచ్... లేదంటే ఇంట్లో పెళ్ళి చేసేయడమో లేక
ఇంటి పనులు చేయిస్తారనో స్కూలుకి వచ్చేవాళ్ళు. అదంతా తొట్టి గ్యాంగ్. ఇక ఏ బేచ్ కి
చెందకుండా మిగిలిపోయిన రెండు పక్షులం శాంతులం. అది నేను..నా స్నేతురాలు.. ఇదీ నా
బుడ్డి గ్యాంగ్.
ఇక నాతో స్నేహం చేయడానికి మిగతావారిని నేను
పెద్దగా ఆకర్షించలేకపోయాను. నా తరువాతది చదువుతో అందరినీ ఆకట్టుకుంది. తనంటే
మాస్టార్లు కూడా మెచ్చుకునేవారు. బాగా పాడేది. వ్యాసరచనా, పద్య పఠనం, ఇక ప్రతి
పరీక్షలోనూ నేను ఫెయిల్, అది పాస్.. సరే ఏడో తరగతి మా శర్మా మాస్టారు పుణ్యమాని ఎలాగో
పాస్ అయ్యాను. ఎనిమిది, తొమ్మిదో తరగతికి మరీ ఆటలు ఎక్కవైపోయాయ్.. లెక్కల్లోని అంకెలు
మరీ కష్టంగా కనిపించడం మొదలెట్టాయి. తీటాలు, మాత్రికలు ఎక్కిచచ్చేవికావు. ఇంగ్లీషు పదాలే రావు, ఇక తెలుగైతే సరేసరి అన్నీ నోరు తిరగని పద్యాలే...
నేను గొప్పగా చెప్పుకోడం కాదుగానీ నా ప్రతిభ మా
మాస్టార్లుకు బాగా తెలుసు. ఓసారి రామానుజన్ పేరుమీద ఎగ్జామ్ పెట్టారు.
అనపర్తి వెళ్ళి రాయాలి. అది పాస్ అయితే పెద్ద సర్టిఫికెట్ ఇస్తారట అని
బక్కది నాన్నగారితో చెప్పడం విన్నాను. నాన్నగారు దానికి ఎంతో పొంగిపోయారు. ఇక మా
అమ్మయితే అప్పుడే పితికిన మేకపాలు పట్టించింది. పాపం పిల్ల బలహీనమైపోతుంది. రేపు
పరీక్ష ఏలా రాస్తుందో అంటూ.. నేను తెగ ఊగిపోయాను నా పేరు ఇవ్వడానికి. ఈ కారణాలతో
నేనూ పేరు ఇస్తానంటే మా శంకరం మాస్టారు నావంక చూసి "ఏంటి నువ్వు పరీక్ష రాస్తావా"..
ఏం వద్దుగానీ ఆ కట్టే ఫీజు మీ నాన్నగారికి మిగుల్చు" అన్నారు. ఇక ఏడిచి నేనూ
రాస్తానని గొడవచేసి పేరు ఇచ్చాను. సరే నా గోల పడలేక పేరు తీసుకున్నారు. అది కాస్తా
తుస్ మందా ఇక నేనంటే ఎవరికీ లెక్క లేకుండా పోయింది.
త్వరలోనే నవంబర్ 14కి పెట్టే పోటీల్లో మా స్కూల్లో పద్యపఠనం, వ్యాసరచనలో అందరూ పేర్లు ఇచ్చేసారు. సరే మా బక్కది ఇచ్చింది కదాని నేనూ పేరు అన్నిటికీ ఇచ్చాను. మా హిందీ మాస్టారు నన్ను చూసి తల కొట్టుకున్నారు. "ఏమిటో నీ ఆరాటం నాకు అస్సలు అర్థం కాదు. ఎందుకొచ్చిందోయ్.. పోయి కబాడ్డీ ఆడు నీకు బహుమతి వస్తుంది" అన్నారు. "ఊహూ నేనూ పద్య పఠనంలో ఉంటాను మాస్టారు" అన్నాను. ఇక సరేలెమ్మని పేరు తీసుకున్నారు.

అలా హిందీ, ఇంగ్లీషు, తెలుగు పద్యపఠనంలో నాపేరు ఇచ్చాను. బక్కదానికి నాతో ఆరోజు రాత్రి పెద్ద గొడవే అయ్యింది. ఎందుకే పేర్లు
ఇస్తావ్. ఒక్కదానిలోనూ నీకు బహుమతి రాదుకదా.. అందరూ నవ్వుతారు.వద్దుగానీ వెళ్ళి
ఆడుకో అంది. నాకు కోపం వచ్చింది ఈడ్చి కొట్టాను. ఇక మా అమ్మ రంగంలోకి దిగి
తిట్లదండకం అందుకుంది. తెల్లారి స్కూల్లో పద్యాల పోటీ... నేను హిందీ, తెలుగు,
ఇంగ్లీషు అన్నీ పద్యాలు అవగొట్టేసి వచ్చాను. హిందీ పద్యం మధ్యలో మర్చిపోయాను. ఇక ఇంగ్లీషు సరేసరి...
ఇక రెండురోజుల్లో బాలల దినోత్సవం ఉందనగా మా హెడ్ మాస్టారు రాజుగారు ప్రెవేట్ క్లాసులో ఉన్న నన్ను, బక్కదాన్ని పిలిచారు. మీ చెల్లికి మొత్తం 13 బహుమతులొచ్చాయ్.. ఈ సంవత్సరం అన్నీ బహుమతులూ తనవే.. ఒక్క తెలుగు పద్య పఠనంలో తప్ప. నాముఖం మాడిపోయింది. అన్నీ దానికే వచ్చేసాయి. ఈలోపు మా బక్కదానికి ఆత్రం ఆగలేదు ఆ ఒకటీ ఎవరికి వచ్చిందండి మాస్టారు. ఎందులో నాకు రాలేదు అంది. తెలుగులో అమ్మా.. మీ అక్కయ్యకు వచ్చింది అన్నారు.
నా భుజం తట్టి నీకు బహుమతి వచ్చిందోయ్ అన్నారు. ఈ మాట విన్న బక్కది కంటికీ మింటికీ ధారగా రాత్రంతా ఒకటే ఏడుపు...

బాగుందే పుత్లీబౌలీ...
ReplyDelete