Add caption |
అమ్మకడుపున పడి ఆ ఉమ్మనీరులో కొట్టుకుంటూ,
ఈ సృష్టి మర్మం తెలుసుకునే లోపు మనం పుట్టేస్తాం. అందులో తోబుట్టువులు, అన్నలు,
అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు వరసలతో మనలానే ఉమ్మనీరులో కొట్టుకుని
పుట్టినోళ్ళంతా అమ్మ పేగు తెంచుకుని వచ్చేస్తారు. అప్పుడు అమ్మ వీళ్ళూ నీలానే నా
కడుపున పుట్టిన వాళ్ళేరా నీకు అక్క అవుతుంది. ఇది నీకు చెల్లి, వీడు నీ తమ్ముడని
అమ్మ చెప్పినపుడు మొదలైన ప్రేమ పాశం, మళ్ళీ మనలో ప్రాణం గాలిలో కలిసిపోయోంత వరకూ
ఉంటుంది. అది ఎందుకు ఏర్పడిందో చెప్పడం
కష్టమే.. నా వరకూ నాకు నా తల్లి చెప్పిన నాటి నుండీ ఈ క్షణం వరకూ ఆ ప్రేమ
ధారగా నా నరనరాల్లోనూ ప్రవహిస్తూనే ఉంది... అంతా పిచ్చగోల అనుకునే నేటి అధునాతన
అక్కా, చెల్లెళ్ళకు, తమ్ముళ్ళకు ఇది చదవాల్సిన అవసరం లేదు. మామూలుగా
చెపుతున్నాను.. అంతే.. నాకు చెప్పాలనిపించి, మీరు చదవాలనేంకాదు..
మనిషిని సెంటిమెంట్ లో కొట్టుకునేలా పెంచేది తల్లితండ్రులే.. వారిని ఏ
బంధానికీ కాకుండా ఎదురుగా రక్తం కక్కుకుని చచ్చినా చుక్క మంచినీరైనా పోయకుండా కర్కశంగా పెంచేదీ తల్లి తండ్రులే.. లోపం
బిడ్డల్లో కన్నా, తల్లితండ్రుల్లోనే
ఎక్కువగా ఉంది.
సరే నేను చెప్పాలనుకున్నది ఇది కాదు..
ఈ రాయడమనేది ఉందే చేతికీ,
మెదడుకీ మధ్య చాలా వ్యత్యాసం
వచ్చేస్తుంది. చేయి రాస్తానన్న విషయాన్ని
ఒక్కోసారి మొదడు రాయనీయదు. ఎందుకో
తెలుసా.. దానికి హద్దులు తెలుసు..
నా తండ్రికి నాలుగురు సంతానంలో నేను మొదటిదాన్ని.. పెద్దగా చదువబ్బలేదు..
కారణం ముందే చెప్పాగా మగపిల్లాడిగా పెరగాలని, ఆడపిల్ల కట్టుబాట్లు నామీద
ఉండకూడదని... ఇదంతా నేను అనుకున్నట్టు జరగలేదు. ఎంత ఆడినా గెంతులేసినా.. నాలో ఏం
జరుగుతుందో అంచనా కట్టేదాన్ని.. అవును నేను
మిగతా ముగ్గురిలా కాదు.. కాస్త తేడా ఉంది.
నా తరువాత పుట్టింది బాగా చదువుతుంది,
ఇక చిన్న చెల్లి పరవాలేదు. తమ్ముడు ఆఖరువాడు వాడంటే అందరికీ ఇష్టమే.. ముగ్గురు
ఆడాళ్ళ తరవాత మగపిల్లాడు కదా.. వాడేం చేసినా ఇంట్లో కాదనేవారు కాదు.. వాడికి అదే
నేతితో తయారుచేస్తారే.. ఆ బిస్ కెట్లు ... మాకు బ్రిటానియా అని పేరు దిబ్బా.. ఊరు
గొప్ప బిస్కెట్లు మాకు పడేసేవారు..
ఇక వాడికి ఇదంతా భలే ఉండేది. అవును నన్ను రామచిలకలు తెచ్చి అమ్మనాన్నకు
ఇచ్చాయే.. మిమ్మల్ని పందులు పట్టుకొచ్చాయట అని చెప్పేవాడు.. మేమే కాదూ వాడూ బయటినుండే వచ్చాడనేవాడు. వెధవ వాడినీ ఏదోటి మోసుకొచ్చాయని
మాత్రం టక్కున అనేవాడు..
ఈ వ్యత్యాసం చాలా ఏళ్ళు గడిచింది. దాదాపు పెద్దవాళ్ళం అయినంత వరకూ ఇలానే
సాగింది. మరీ ముఖ్యంగా నా విషయంలో అయితే
మరీనూ.. కానీ నాకు నా తమ్ముడంటే భలే ఇష్టం. వాడిని పుట్టిన పదినిముషాలకే మొదటగా
ఎత్తుకున్నాను. అప్పటికి అమ్మ ఇంకా మైకంలో ఉంది. ఎంత గాఢంగా ముద్దాడానంటే చెప్పలేను.
వాడిని కనడానికి అమ్మ చాలా కష్టపడింది. నలుగురు సంతానంతో ఆమె విసిగిపోతే ఈ
బుడ్డాడిని భుజాన వేసుకుని లాలిపాడి నిద్రపుచ్చేదాన్ని.
ఇప్పటికీ గుర్తే ఓరోజు
ఇద్దరం ఇంటినుండీ నడుస్తున్నాం. అప్పటికి వాడికి మూడో ఏడు ఉంటుందేమో.. ఆకలి
అన్నాడు. అప్పటికి నాకెంత ఎనిమిదో ఏడు ఉంటుంది. అటూ ఇటూ చూసాను. రోడ్డుకి ఇటుపక్క
చిన్న పిట్టగోడ వెనక జామకాయలు వేలాడుతున్నాయి. తమ్ముడిని ఎదిరింటి అరుగుమీద కూర్చోబెట్టి గబగబా గోడ ఎక్కి టక్కున నాలుగు
కాయలు తెంపి కిందకి విసిరేసాను. తీరా నేను గోడ దిగే సమయానికి నన్ను ఆ పక్కింటి
పనివాళ్ళు పట్టేసుకున్నారు. నన్ను, తమ్ముడినీ చెరో స్థంబానికీ కట్టేసారు.
ఎవరిపిల్లలో చెప్పమని అడిగారు. నేను మాట్లాడలేదు. తమ్ముడికి మాటలు రావు. నేను
తిరిగి చూస్తే అది పెద్ద మండువా లోగిలి ఇల్లు. చూట్టు పెద్ద గచ్చు చేసిన
నేల, పెద్ద గేటు.. నేను ఎక్కిన జామచెట్టు ఉన్న దొడ్డి మీళ్ళు కొత్తగా
కొనుక్కున్నారు. అంతలో ఈ గోలకి పెద్ద తలుపులున్న గుమ్మం గడపను దాటుకుంటూ ఆ ఇంటి
యజమానురాలు వచ్చింది. పెద్ద బొట్టు, ఒంటికి మోయగలిగినన్ని నగలు, జరీ అంచు చీర.. ఇవన్నీ
ఉంటే అందం అదే వస్తుందిగా.. అలానే ఉందామె.
మమ్మల్ని చూసి గద్దించి అడిగిందామె నేను చెప్పాను. ఫలానా సత్యనారాయణగారు మా
నాన్నగారని. ఏమనుకుందో సరేలేరా వదిలేయండి. ఏయ్ పిల్లా ఇటు పైన కాయలు కోసావంటే
నిన్ను మామూలుగా వదలను అంటూ
కళ్ళెర్రజేసింది. సరేలే.. ఈ సందడికి నా తమ్ముడు ఏడుపు మొదలు పెట్టాడు.
బతుకుదేవుడా అని బైటపడ్డాం... కానీ మళ్ళీ నేను జామకాయలు దొంగిలించలేదని మీరనుకుంటే
మీరు పప్పులో కాలేసినట్టే....ఆహా..హా
కానీ ఇక్కడ ఒకటి మాత్రం చెప్పాలి. వాడి ఆకలిని, వాడి నిద్రని తెలుసుకుని చిన్నతనంలో అమ్మతరవాత అమ్మగా పెంచాను. పుట్టినరోజు పూట నేను పెట్టే నలుగు స్నానం అన్నీ ఏలా మరిచిపోయాడో తెలీదు.. మనుషులు మారిపోతారు. ఇది నిజం కానీ పరిస్థితుల ప్రభావంతో మారిపోవడం ఉంది చూసారూ అది మనసుని మెలితిప్పి భాధిస్తుంది. ఈ అక్కను వదిలేసుకున్నా, నేను మాత్రం ఎప్పటికీ వదులుకోను... :)
కానీ ఇక్కడ ఒకటి మాత్రం చెప్పాలి. వాడి ఆకలిని, వాడి నిద్రని తెలుసుకుని చిన్నతనంలో అమ్మతరవాత అమ్మగా పెంచాను. పుట్టినరోజు పూట నేను పెట్టే నలుగు స్నానం అన్నీ ఏలా మరిచిపోయాడో తెలీదు.. మనుషులు మారిపోతారు. ఇది నిజం కానీ పరిస్థితుల ప్రభావంతో మారిపోవడం ఉంది చూసారూ అది మనసుని మెలితిప్పి భాధిస్తుంది. ఈ అక్కను వదిలేసుకున్నా, నేను మాత్రం ఎప్పటికీ వదులుకోను... :)
ఇక నా చెల్లెళ్ళ గురించి మరోసారి మాట్లాడుకుందాం... అయినా ఒక్క తోబుట్టువులే
కాదు ఇప్పుడు తల్లీ బిడ్డల మధ్యనే సఖ్యత తక్కువగా ఉంటుంది. సరేలెండి నేను మరీ ఎమోషన్ కి లోనైపోయి ఈ వాఖ్యాలు రాసేయడం అది
చదివి మీరు బాధ పడిపోవడం ఇదంతా కాదుగానీ రేపటికి
మన మామూలు లాంగ్వేజీకి వచ్చేస్తాను..
ఆగ్రిగేటర్‌ల లోకి కొత్తగా వచ్చినట్లున్నారు. బాగా వ్రాస్తున్నారు.
ReplyDeleteHappy Blogging !