వర్ధిల్లు...

 



రాత్రి కోరికలతో కరిగిపోయింది
మనసు మూలుగుతూ
నీ మైకంలో చిక్కుకుంది
నువ్వు వస్తున్న జాడ
నీ అడుగుల శబ్దం
నీ నవ్వే కళ్ళు
రవి చూపులేని పద్మంలా
ముడుచుకున్న కనురెప్పలు
తెలుసు..నీ ప్రేమ మూలాలు
నీ ప్రేమను విశ్వసించాను
చీకటి నక్షత్రల్లో ఘనీభవించిన
నీ మెరిసే నవ్వు..
ఎన్ని కబుర్లాడేది.ఇంకా నీ నవ్వు
ఈ కళ్ళలో తోవ తప్పిపోయింది
నీకు తెలుసా?
నీకళ్ళ అగాధాలలో నా పాటలను
వెతికి నీరసించాను.
ప్రణయ వాంఛలతో
నీ ముందుకు వస్తున్నాను.
నన్ను చుట్టుకో.ఈ వాంఛ
అంతం తెలియనిది.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

పంచాయతీ మెట్లు

గమ్యం తెలియని పాత్రల పయనం "హిమజ్వాల"

అల్లం శేషగి రావు కథ "చీకటి"