చంద్రుడు సముద్రపు
లోతుల్లోకి తొంగి చూసినట్టు
ఆ చెట్ల వెనుక నీడలోంచి తీక్షణంగా
మెరిసే నీచూపు
ప్రకాశించే ఈ కళ్ళ వెనుక
కన్నీళ్ళకు ఆనకట్ట నీ ప్రేమా వాత్సల్యాలే
కానీ లోన అల్లుకుపోయిన
ముళ్ళపోదలెన్నో ఉన్నాయి
వాటి మాటేమిటి..?
ఈ హృదయ భారాన్ని నీ నవ్వుతో
తగ్గించు
నీ హృదయపు విచారాన్ని అప్పుడు
పంచుకుంటాను.
నాముందు జీవితపు సారాన్నంతా
నీ రెండు కళ్ళలోనూ చూస్తున్నాను.
ఈ గుండెను చీల్చుకుంటూ
వస్తున్న గత కాలపు జ్ఞాపకాలను
నీ చేతులతో అడ్డుకో
నాపై నీ ప్రేమ దృఢమైనది.. ఎప్పటికీ
నిలిచి ఉంటుందని విశ్వసిస్తాను.
No comments:
Post a Comment