అలలపై తేలుతూ,




 గాలి విసురుకు జ్ఞాపకాల

బుడగలు పగులుతున్నాయి.
అలలపై తేలుతూ,
అప్పుడప్పుడు పలకరిస్తాయి.
కాలి అడుగులకు బయపడి
దారి మార్చుకుంటూ..
ఎక్కడా ఎవరికీ కనిపించక
లోలోన దాగి..
మోయలేని భారమిది.
ఎన్ని గురుతులవి
ఎన్ని జ్ఞాపకాలు..
తడారిన ఒంటిపై నీటి
బిందువుల గురుతులు
ఎన్నని మోసుకెళ్ళను.
ఎక్కడివో మల్లెలు
దోసిలిలో పోసినట్టు
ఎక్కడని దొరుకుతావు
ఈ జ్ఞాపకాల్లో తప్ప
పిచ్చి గాలి చెప్పినా వినదు.
సంధ్యలోనూ నేనున్నానంటూ
నిన్ను అప్పగించి పోతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

పంచాయతీ మెట్లు

గమ్యం తెలియని పాత్రల పయనం "హిమజ్వాల"

అల్లం శేషగి రావు కథ "చీకటి"