చీకటి లోతుల్ని నెగ్గుకువచ్చేవేళ
పిడికెడంత గుండెల్లో ఆనందాన్ని
కళ్ళలోకి ఆహ్వానిస్తూ...
మౌనంలోకి తప్పిపోయి
మళ్ళీ వస్తాను.
సిగ్గును నీ కళ్ళచివర
తగిలించి నీవైపు
దొంగచూపులు చూస్తాను.
ఇద్దరి మధ్యనా నెగ్గని మల్లె
సుగంధాలకు విడ్కోలు పలికి
మర్మమే లేని నా మనసును
నీముందు పరుస్తాను.
తప్పిపోయి నీస్పర్శతో సిగ్గుపడ్డ
కురులను సవరిస్తూ
దోరనవ్వు విసురుతాను.
మన ఏకాంతాన్ని లెక్కలు కడుతూ
జ్ఞాపకాలను కళ్ళలో దాస్తాను
పూలమాలలుగా గుర్చి నీ మెడలో
అలంకరిస్తాను.
రాతిరి రహస్యాల్ని నెమరు వేస్తూ
ఉదయం నీముందుకు
మళ్ళీ వస్తాను.
No comments:
Post a Comment