కలలు



నన్ను మింగేసే కలలు
ఉదయకాంతిని కొత్తగా నీ నవ్వులా
పరిచయం చేస్తూ...
లోలోన దొర్లిపడే ఆలోచనా
తరంగాలకు రూపమిస్తూ..
నీతో పంచుకున్న అనుభూతికి
రెక్కలిచ్చి పంపుతున్నాను.
కలలో
వసంతకాలపు సొబగు
ధ్వనించే వీణానాధానికి కంపించే దేహం
మధుర గాన లాహిరిలో
నీ నవ్వు కలసిపోయింది.
ఈ సృష్టించిన ఆనందానికి
లాలించి ఆకారమిచ్చాను...అపుడూ నీ నవ్వే రూపమే వెక్కిరింపుగా నన్ను
చూస్తుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గమ్యం తెలియని పాత్రల పయనం "హిమజ్వాల"

అల్లం శేషగి రావు కథ "చీకటి"

పంచాయతీ మెట్లు