హృదయపు కోత

 


మౌనంగా ఆకాశపు అంచుల

నీలిచ్ఛాయల్లో మది
తలుపులు తెరిచి..
నా ఆత్మ నగ్నత్వాన్ని,
వాంఛను., సౌందర్యంతో నీ
ముందుంచాను.
ఈ హృదయపు కోత
ఆ క్షణాన నన్ను చీకటిని
మూలలకు నెట్టేసిన కాంతిలా
నీ నుంచి దూరంగా తరిమేసింది.
ఈ ఒంటరితనంతో ఉదయం
అలసిపోయింది
జీవితమంతా దివ్యమైన నీ
రూపాన్ని చూసి ఆనందించాలని
ఎన్నో కలలు కన్నాను.
కానీ నీ చిరునవ్వుకు స్వేచ్ఛ లేదు
వొడ్డుకు చేరవొచ్చిన గులకరాయిలా
సూర్యాస్తమయంలో చీకటిని
కప్పుకుంటున్న
కాంతిలా దీనంగా ఉంది.
రేయి దాటింది. ఇన్నాళ్ళూ
నా కన్నీళ్ళకు మసకబారిన నీరూపు
మళ్ళీ రూపం దిద్దుకుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

పంచాయతీ మెట్లు

గమ్యం తెలియని పాత్రల పయనం "హిమజ్వాల"

అల్లం శేషగి రావు కథ "చీకటి"