ఊహించు..




ఊహించు నేనెవరినై ఉంటానో
స్పర్శను మరిచిన దేహాన్ని
కునికిపాట్లు పడే కలవరాన్ని
ఆకాశాన్ని కప్పేసే మేఘాల తెర
వేగం తగ్గిన డేగల ఒగుర్పు
దేనికి నాకీ ఆశ
ఎన్నని అనుభవాల్ని కుప్పగా పోస్తే
ఈ గుండె వెలుగులో
మరణాంతర జీవితం చూస్తావు.
నరనరమూ కాల్చే జ్ఞాపకాలను
తడిమిచూడు
ఎన్నని చూపగలను
కరిగిన కాలానికి ఆనవాళ్లు
అంటుకున్న ఆలోచనల సావాసాన్ని
గురుతుపట్టావా నేనెవరో
రాతిరిని జారవిడిచిన విషాదాన్ని
ఒరుసుకున్న విషాదపు మధ్యాహ్నాన్ని
ఎదురుచూపులో దగ్ధమైన ఏకాంతాన్ని
మసకబారిన హృదయపు గదిలోకి
తొంగి చూడు
గతకాలపు ఆనవాళ్లు తప్పక
తడుముతాయి
అప్పుడైనా ఊహించు
నేనెవరినో...?

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

పంచాయతీ మెట్లు

గమ్యం తెలియని పాత్రల పయనం "హిమజ్వాల"

అల్లం శేషగి రావు కథ "చీకటి"