రానా మరి



బహుశా ఇది కలేనేమో

నిజమయ్యే వీలే లేదేమో

నల్లని దుప్పటి కప్పుకున్న

రాతిరి కదలకుండా ఉంది

ఎన్ని వేల మెట్లో నిన్ను 

చేరేందుకు

క్షణం క్షణం అదృశ్యమై 

మరో ఊహను పుట్టిస్తూ

రాత్రి నిండా వేడి నిట్టూర్పులతో 

ప్రతిచోటా నిలిచిన చీకటి కబుర్లతో

తొలకరి నీటితో నిండిన మడుగులా

ఉంది మనసు

నాకూడా ఇంకేం తేలేను..

నా చేతి వేళ్ళకు అంటిన నీ 

ఒంటి వాసనను పట్టుకుని

రమ్మంటావా మరి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

పంచాయతీ మెట్లు

గమ్యం తెలియని పాత్రల పయనం "హిమజ్వాల"

అల్లం శేషగి రావు కథ "చీకటి"