Monday, 15 March 2021

కాలాన్ని మరోసారి ఆపనా




ఈ ప్రేమనేది ఇద్దరిమధ్యా 

లంకెవేసి మాయమవుతూ ఉంటుంది

చేసుకున్న బాసలన్నీ భస్మమయ్యాకా

ఇంకేముందీ

వెనక్కు వెళ్ళడం వదిలిన 

జ్ఞాపకాలను తడిమి రావడం 

ఇంతే

సాగరాన్ని మధించి 

తెచ్చిన అమృత భాండంలో 

వేల కన్నీటి చక్కలను కలిపి తాగడం

కాలాన్ని ప్రాధేయపడతాను

నీవు లేకుండా సాగిపోతున్న 

క్షణాల వేగాన్ని తగ్గించి

కాస్త నెమ్మదిగా జరగమనీ

నీలా నేను మరిచిపోలేను మరి

గాలివాటుగా పుట్టిన ప్రేమ 

కాదని చెప్పాలని తపన పడతాను

ఈ దేహాన్ని నీకు ఇచ్చేసినపుడు

నీ ఒంటివాసన మెరిసి ఈ మెడ 

ఒంపున ఉండిపోయింది

అప్పుడప్పుడు గుండెల్లో 

దిగిన బాకులా రక్తాన్ని చిందించి..

బాధను మళ్ళీ మళ్ళీ మెలితిప్పుతుంది 

రెండు హృదయాలూ పెనవేసి 

ఎన్ని ఊసులాడుకున్నాము

ఎన్ని పోగేసుకున్న చిరునవ్వులు 

నీ తలపు ఇచ్చిన సుఖాన్ని 

మరిచిపోయి

బీడలుతేలి కన్నీరుకు 

ఒరిసిపోయింది గుండె

నీ మాటలకు గాయాన్ని చేసే గుణమే

తప్ప చెరిపేసే గుణం లేదు కాబోలు

చింత రవ్వంత లేని మనసైపోయింది

No comments:

Post a Comment

నీలోకి ఒలికిపోయాననీ..

ఈరోజుకి రాసే ప్రేమలేఖ ఇది..  కొన్నిసార్లు అనిపిస్తుంది.  నేను నీలోకి ఒలికిపోయాననీ..  నీలోకి వచ్చి చేరాకా హృదయంలోని నిశ్శబ్దానికి...