Monday, 29 March 2021

మర్మం ఎరిగిన దీపాలు




సంధ్యవేళ ఆ దీపాలు

మాట్లాడుకుంటాయి
ఎప్పుడైనా గమనించావూ!?
ఆ మాటలన్నీ రాతిరి ప్రేమ మాటలే..
అందులో ఎన్ని కలలో
మరెన్ని వగలో
ఒక దీపరాణి అంటుందీ నేనీ
గదిలో స్వర్గాన్ని కలిసాననీ
మరోటి చీకటిని తరిమి
ఏకాంతపు రాతిరిలో
ప్రేమగానాలు విన్నాననీ
ఎవరికీ తెలియని కథలన్నీ
పట్టుకుంటాయి ఈ దీపాలు..
మసక కాంతిలో జరిగే తంతంతా
చూస్తూ ఊసులాడుకుంటాయి
జీవితపు రహస్యాలన్నీ వాటికెరుకే
ప్రేమలు పండే చోట అతిథులు
దేహాలు కలిసేచోట దొంగలు
కాలే నిప్పుకు పై పూతలు
సెగలు చిమ్మే సూర్యకాంతికి
పుత్రికలు ఈ దీపాలు
భావాలకు రంగులు పూసి.,
చిరునవ్వుకు సాక్ష్యాలై
జీవిత మర్మం ఎరిగినవి
ఈ దీపాలు
కలత చెందిన చోట కఠినమై
చీకటిని నింపి పోయినా
వాలిన పొద్దుకు ఏరువాక
పున్నములు ఈ దీపాలు
ప్రేమరాజ్యానికి మొహపు
పరిచారికలు
దేహపుష్పం మీద పడి మెరిసే
చిగురాకు నీడలు

No comments:

Post a Comment

నీలోకి ఒలికిపోయాననీ..

ఈరోజుకి రాసే ప్రేమలేఖ ఇది..  కొన్నిసార్లు అనిపిస్తుంది.  నేను నీలోకి ఒలికిపోయాననీ..  నీలోకి వచ్చి చేరాకా హృదయంలోని నిశ్శబ్దానికి...