వెతుకుతున్నాను



నాలుగక్షరాలను 

వెతుకుతున్నాను 

ఉదయం నుంచి

నన్ను కాలంతో వేరుచేసే 

అక్షరాలని

చీకటి దారుల్లో 

వెలుగునింపే అక్షరాలని

వెతుకుతున్నాను 

కసిరేపే అక్షరాలని

కొత్త మాటలుగా 

మొలకెత్తుతాయని 

సంద్రాన్ని చిలికి 

అమృత బాండాన్ని 

చేతికిస్తాయనీ

అలజడి రేగిన గుండెలకు 

ప్రశాంతతని తెస్తాయని

కాంతిధారలను ప్రకాశిస్తూ

వేల నేత్రాలలో వెలుగు 

నింపుతాయనీ

నా ఆలోచనలకు రూపాన్నిచ్చే 

అక్షరాలను వెతుకుతున్నాను

ఉదయం నుంచి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గమ్యం తెలియని పాత్రల పయనం "హిమజ్వాల"

అల్లం శేషగి రావు కథ "చీకటి"

పంచాయతీ మెట్లు