Friday, 19 March 2021

స్పందించని ప్రేమ..


కన్నీరును దాచుకుని 

కళ్ళుమూసుకుని 

మౌనంగా ఊరుకొని

ఇప్పుడు

వేయి గొంతుకలు పూడుకున్న 

బాధను మోస్తుంది హృదయం

విడిచిన ప్రేమల సాక్షిగా

వెంటపడిన దిగుళ్ళను మోస్తూ

నీ రూపం ఆలోచనలో ఎదురైన ప్రతిసారీ

ఎటో తప్పించుకుంటాను

వాలిన చూపుల గాలాలు

మూగబోయిన గొంతుకలు

చిరునవ్వును వెతికి పట్టుకోవాలి

వినిపించని కబుర్ల హోరు

నీతో నడిచిన దారులలో 

వెలిసిన జాడలు

మొదట స్నేహం ప్రేమయింది

ఇప్పుడు తీరని దిగులు

రేపు విషాదం నిండిన గురుతు

ఓడిపోవడం..గెలవడం

కాకుండా..ఇంకేం చేయగలదు

ఈ ప్రేమ

No comments:

Post a Comment

నీలోకి ఒలికిపోయాననీ..

ఈరోజుకి రాసే ప్రేమలేఖ ఇది..  కొన్నిసార్లు అనిపిస్తుంది.  నేను నీలోకి ఒలికిపోయాననీ..  నీలోకి వచ్చి చేరాకా హృదయంలోని నిశ్శబ్దానికి...