చీకటి రేఖ సాక్షిగా..



ఎంత ప్రయత్నం చేసినా 

రాతిరి గుమ్మానికి

ఇంకా వేలాడుతూనే ఉన్నాయి 

మరిగే ఆలోచనలు

ఎన్నోసార్లు నీ రూపురేఖలు 

బారులు తీరి.. 

మనసును భారం చేస్తాయి.

మూసి ఉన్న అదే కిటికీ 

రెక్కపై పరుచుకున్న చీకటి రేఖ సాక్షిగా

గాజు అద్దానికి మొలిచిన నీడలు

శిథిల ఆలోచనలతో 

ఎంత వెనక్కుపోతే నాకు అంత కష్టం

ఎటూ పాలు పోదు మనసునూ 

తిప్పుకోలేను

ఈ రాతిరికి అడ్డంగా వచ్చిన 

చందమామకు మాత్రం ఏం తెలుసు

నీ కౌగిలిలో కరిగిన వసంతాలకు లెక్క

కాలంతో మొండిగా వాదించడం 

తప్ప ఈ రెండు హృదయాలకూ

మధ్య ఎంతటి అగాధం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

పంచాయతీ మెట్లు

గమ్యం తెలియని పాత్రల పయనం "హిమజ్వాల"

అల్లం శేషగి రావు కథ "చీకటి"