మంచు పలకరింపు
ఇటుగా బయలుదేరి వచ్చింది హిమాలయం ప్రతి ఊరునీ కలుపుకుంటూ చలి విత్తనాలు చల్లుతూ గడ్డివాము, పంట పొలము, సిమ్మెంటు బెంచీ నువ్వు నేనూ అన్నీ చుట్టాలే ఒకటే ఈ చలిగిలికి వెచ్చగా దుప్పట్లో జోగుతున్న నగరాలు పొగమంచు కమ్మేసిన దారులు చిటపటలాడే చలిమంటలు ఎదురుచూడని మంచు దేవతకు హారతులు ప్రేమలు చిగురించి పూలుపూచే కాలం పరువానికి రెక్కలు మొలిచే కాలం సిగ్గు నెరిగిన వాన చినుకులు తోరణాలై మంచు కన్యను చుట్టుకునే సంబరం