నువ్వేనా..అది


నవ్వేవా..ఆ పూలతీగల
గలగలల మాటున
అదే
జాబిలి చేతిలోకి
జారినట్టుగా






నీ మనసేం చేస్తుంది
నిన్ను నామీదకు
ఉసి గొలుపుతూ
నిజానికి ఈరోజు
తెల్లవారు తుండగా
నీ ఆర్తి సెగ తగిలి
మోడుబారిన
హృదయమల్లే
మిగిలిపోయాను
నువ్వేసిన గురుతులను
తడుముకుని నీ స్పర్శను
కలగన్నాను
వర్షించే మేఘమల్లే
కన్నుల తడి
మోహాన్ని భరిస్తూ
మౌనంగా మిగిలింది
నీ ముందు లజ్జతో
ఆవిరిగొన్న ముఖాన్ని
ప్రదర్శిస్తూ
నీ కౌగిలింతల మాటున
నలిగిపోయింది మేను
నిటారు సొగసుల నీలి
అందాలను అందుకోవాలని
బోలెడు ఆశ పాపం

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

పంచాయతీ మెట్లు

గమ్యం తెలియని పాత్రల పయనం "హిమజ్వాల"

అల్లం శేషగి రావు కథ "చీకటి"