ఆ గాలేం చేస్తుంది




 నిశ్శబ్దంగా నా పక్కన చేరి

గోరువెచ్చని నీ స్పర్శను 

గురుతుచేస్తుంది

నీ జాడలు వెతుకుతూ

స్వప్న వీధుల్లో వెర్రి ఆలోచనల

వెంట తీసుకుపోతుంది

ఆ గాలేం చేస్తుంది.. 

అర్థరాత్రి అలసిన దేహానికి

జ్ఞాపకాలతో చికిత్స చేస్తుంది

మనసుకు గిలిగింతలు 

పెట్టి, ఊహలకు రెక్కలిచ్చి 

నీ దగ్గరకు పంపుతుంది

ప్రేమలో మాధుర్యాన్నంతా

పోగేసి అలల తరంగంలా

నన్ను కమ్మేస్తుంది

నీవు వదిలిన గురుతులను 

తడుముకుంటూ

రాతిరిలో మేఘాల 

మాటున చందమామనైపోతాను

నీకివేం పట్టవు..

ఆ పాడు గాలి నిన్ను 

తాకనైనా తాకదేమో కదా

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గమ్యం తెలియని పాత్రల పయనం "హిమజ్వాల"

అల్లం శేషగి రావు కథ "చీకటి"

పంచాయతీ మెట్లు