పోస్ట్‌లు

మార్చి, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

రానా మరి

చిత్రం
బహుశా ఇది కలేనేమో నిజమయ్యే వీలే లేదేమో నల్లని దుప్పటి కప్పుకున్న రాతిరి కదలకుండా ఉంది ఎన్ని వేల మెట్లో నిన్ను  చేరేందుకు క్షణం క్షణం అదృశ్యమై  మరో ఊహను పుట్టిస్తూ రాత్రి నిండా వేడి నిట్టూర్పులతో  ప్రతిచోటా నిలిచిన చీకటి కబుర్లతో తొలకరి నీటితో నిండిన మడుగులా ఉంది మనసు నాకూడా ఇంకేం తేలేను.. నా చేతి వేళ్ళకు అంటిన నీ  ఒంటి వాసనను పట్టుకుని రమ్మంటావా మరి.

మర్మం ఎరిగిన దీపాలు

చిత్రం
సంధ్యవేళ ఆ దీపాలు మాట్లాడుకుంటాయి ఎప్పుడైనా గమనించావూ!? ఆ మాటలన్నీ రాతిరి ప్రేమ మాటలే.. అందులో ఎన్ని కలలో మరెన్ని వగలో ఒక దీపరాణి అంటుందీ నేనీ గదిలో స్వర్గాన్ని కలిసాననీ మరోటి చీకటిని తరిమి ఏకాంతపు రాతిరిలో ప్రేమగానాలు విన్నాననీ ఎవరికీ తెలియని కథలన్నీ పట్టుకుంటాయి ఈ దీపాలు.. మసక కాంతిలో జరిగే తంతంతా చూస్తూ ఊసులాడుకుంటాయి జీవితపు రహస్యాలన్నీ వాటికెరుకే ప్రేమలు పండే చోట అతిథులు దేహాలు కలిసేచోట దొంగలు కాలే నిప్పుకు పై పూతలు సెగలు చిమ్మే సూర్యకాంతికి పుత్రికలు ఈ దీపాలు భావాలకు రంగులు పూసి., చిరునవ్వుకు సాక్ష్యాలై జీవిత మర్మం ఎరిగినవి ఈ దీపాలు కలత చెందిన చోట కఠినమై చీకటిని నింపి పోయినా వాలిన పొద్దుకు ఏరువాక పున్నములు ఈ దీపాలు ప్రేమరాజ్యానికి మొహపు పరిచారికలు దేహపుష్పం మీద పడి మెరిసే చిగురాకు నీడలు

చీకటి రేఖ సాక్షిగా..

చిత్రం
ఎంత ప్రయత్నం చేసినా  రాతిరి గుమ్మానికి ఇంకా వేలాడుతూనే ఉన్నాయి  మరిగే ఆలోచనలు ఎన్నోసార్లు నీ రూపురేఖలు  బారులు తీరి..  మనసును భారం చేస్తాయి. మూసి ఉన్న అదే కిటికీ  రెక్కపై పరుచుకున్న చీకటి రేఖ సాక్షిగా గాజు అద్దానికి మొలిచిన నీడలు శిథిల ఆలోచనలతో  ఎంత వెనక్కుపోతే నాకు అంత కష్టం ఎటూ పాలు పోదు మనసునూ  తిప్పుకోలేను ఈ రాతిరికి అడ్డంగా వచ్చిన  చందమామకు మాత్రం ఏం తెలుసు నీ కౌగిలిలో కరిగిన వసంతాలకు లెక్క కాలంతో మొండిగా వాదించడం  తప్ప ఈ రెండు హృదయాలకూ మధ్య ఎంతటి అగాధం.

దివిటీతో ఏం వెతుకుతున్నావ్...

చిత్రం
  ఏం వెతుకుతున్నావ్ ఇంకిపోయిన ఇష్టాల జాడలనా తొలిపొద్దు మలిపొద్దుగా మారి జారిన కాలాన్నా మనసులు కలిసి రావడమంటే తెలిసిందే ఆ రాతలనా ఎవరొస్తారు సాక్ష్యం ఏమో..ఈ మనసు గురుతులు తప్ప మరే ముంది సాక్ష్యం జోలపాటగా మారిన ఊసులన్నీ ఏమైనట్టూ ఊరికే ఊగాడిన మనసు బాసలన్నీ దారి తప్పిపోయాయి. చుట్టుకున్న చలిగాలిని ఆపాలనీ ఆ నెగళ్ళ చుట్టూ చలికాచుకున్న కాలాన్ని జ్ఞాపకాలలో చేర్చగలనా ఎన్ని ప్రేమ సందేశాలు పంపాను ఏదీ ఓ జవాబూ చేరలేదు నీటి పొరలతో మసకబారిన  చూపులకు ఎటు చూడు నీ రూపమే ఎన్ని రోజులు వెతకను ఆత్రపడే మనసు ఇప్పుడు కరువైపోయాకా మిగిలిన ఈ శూన్యాన్ని పేర్చుకుంటూ

స్పందించని ప్రేమ..

చిత్రం
కన్నీరును దాచుకుని  కళ్ళుమూసుకుని  మౌనంగా ఊరుకొని ఇప్పుడు వేయి గొంతుకలు పూడుకున్న  బాధను మోస్తుంది హృదయం విడిచిన ప్రేమల సాక్షిగా వెంటపడిన దిగుళ్ళను మోస్తూ నీ రూపం ఆలోచనలో ఎదురైన ప్రతిసారీ ఎటో తప్పించుకుంటాను వాలిన చూపుల గాలాలు మూగబోయిన గొంతుకలు చిరునవ్వును వెతికి పట్టుకోవాలి వినిపించని కబుర్ల హోరు నీతో నడిచిన దారులలో  వెలిసిన జాడలు మొదట స్నేహం ప్రేమయింది ఇప్పుడు తీరని దిగులు రేపు విషాదం నిండిన గురుతు ఓడిపోవడం..గెలవడం కాకుండా..ఇంకేం చేయగలదు ఈ ప్రేమ

కాలాన్ని మరోసారి ఆపనా

చిత్రం
ఈ ప్రేమనేది ఇద్దరిమధ్యా  లంకెవేసి మాయమవుతూ ఉంటుంది చేసుకున్న బాసలన్నీ భస్మమయ్యాకా ఇంకేముందీ వెనక్కు వెళ్ళడం వదిలిన  జ్ఞాపకాలను తడిమి రావడం  ఇంతే సాగరాన్ని మధించి  తెచ్చిన అమృత భాండంలో  వేల కన్నీటి చక్కలను కలిపి తాగడం కాలాన్ని ప్రాధేయపడతాను నీవు లేకుండా సాగిపోతున్న  క్షణాల వేగాన్ని తగ్గించి కాస్త నెమ్మదిగా జరగమనీ నీలా నేను మరిచిపోలేను మరి గాలివాటుగా పుట్టిన ప్రేమ  కాదని చెప్పాలని తపన పడతాను ఈ దేహాన్ని నీకు ఇచ్చేసినపుడు నీ ఒంటివాసన మెరిసి ఈ మెడ  ఒంపున ఉండిపోయింది అప్పుడప్పుడు గుండెల్లో  దిగిన బాకులా రక్తాన్ని చిందించి.. బాధను మళ్ళీ మళ్ళీ మెలితిప్పుతుంది  రెండు హృదయాలూ పెనవేసి  ఎన్ని ఊసులాడుకున్నాము ఎన్ని పోగేసుకున్న చిరునవ్వులు  నీ తలపు ఇచ్చిన సుఖాన్ని  మరిచిపోయి బీడలుతేలి కన్నీరుకు  ఒరిసిపోయింది గుండె నీ మాటలకు గాయాన్ని చేసే గుణమే తప్ప చెరిపేసే గుణం లేదు కాబోలు చింత రవ్వంత లేని మనసైపోయింది

వెతుకుతున్నాను

చిత్రం
నాలుగక్షరాలను  వెతుకుతున్నాను  ఉదయం నుంచి నన్ను కాలంతో వేరుచేసే  అక్షరాలని చీకటి దారుల్లో  వెలుగునింపే అక్షరాలని వెతుకుతున్నాను  కసిరేపే అక్షరాలని కొత్త మాటలుగా  మొలకెత్తుతాయని  సంద్రాన్ని చిలికి  అమృత బాండాన్ని  చేతికిస్తాయనీ అలజడి రేగిన గుండెలకు  ప్రశాంతతని తెస్తాయని కాంతిధారలను ప్రకాశిస్తూ వేల నేత్రాలలో వెలుగు  నింపుతాయనీ నా ఆలోచనలకు రూపాన్నిచ్చే  అక్షరాలను వెతుకుతున్నాను ఉదయం నుంచి