తోటంతా గులాబీలు.. అల్లరి నేర్చిన సీతాకోక చిలుకలు..
గేటువార మల్లె పొదలు.. తుమ్మెదలకు ఆవాసాలు..
వానాకాలం చినుకులను లెక్కపెట్టే నీటి గుంటలు
చెట్ల గుబుర్లలో కబుర్లాడే రామచిలుకలు..
తొలివలపుల చిన్నెలెన్నో విసిరిన విరహ జంటలు..
అందకుండా పరుగులు పెట్టే నిద్రనెరుగుని సమయాలు..
కొసరి కొసరి సరసాలాడే ప్రేమ జంటల చెక్కిలిపై నొక్కులు..
జారు సిగలో జాజులు చెప్పే చిలిపి కబుర్లు..
వయసు చేసే అల్లర్లతో బృందావనమే అంతా..
నీలాంబరాన్ని తాకి నిద్దురపోయిన రోజులే అన్నీ..
నిరాశనెరుగని రోజులవి.. ప్రేమను పంచిన దినాలు.
బద్దకాన్ని కప్పుకున్న ఉదయాలు..
చంద్రుని కాంతి మాటున తడి ఆరని జ్ఞాపకాలు..
No comments:
Post a Comment