ఓ చలి కాలం రాత్రి






కమ్మేసిన ఆలోచనలు
గాలికి ఊగే
సన్నజాజి తీగ

పలకని రాతిరికి జవాబిస్తూ
సగం తెగినా
వన్నె తగ్గని చందమామ

తాళుక్కున మెరుస్తున్న
చుక్కల అందాలు
ఆకాశంలో పరుచుకున్న
నిశ్శబ్దానికి జోల

పొగమంచును
చుట్టుకుని
చెట్ల గుబుర్ల ఒణుకు
ఒంటరిగా వేచి చూస్తున్న
మసకబారిన దారులు

నీలి కన్నులు
నిద్ర కోసం కాచుకున్నాయి
ప్రేమించిన సమయాలను
తడుముతూ ఆమె

అతని కౌగిలి వెచ్చదనాన్ని
కలగంటూ
మగత నిద్దురలో
రహస్య పరామర్శ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

పంచాయతీ మెట్లు

గమ్యం తెలియని పాత్రల పయనం "హిమజ్వాల"

అల్లం శేషగి రావు కథ "చీకటి"