కలగన్నావా నన్ను..




నీలి ఆకుపచ్చ చీరకట్టి చేతులకు మట్టిగాజులతో రేయినంతా నూరి కళ్ళకు కాటుకగా పెట్టుకన్నాను


ఇక్కడి కలలకు స్వస్తిచెప్పి నీకలల ప్రపంచంలోకి అభిసారికనై అడుగులు వేస్తూ..


ఆ వంటగది కిటికీదాటి గుమ్మానికి అనుకుని నిలుచున్నాను...కనిపించానా..


దిగుళ్ళబావికి తాళాలు వేసి చిరునవ్వుల సంతకంతో నీకోసం ఎదురు చూస్తున్నాను..


పసిపాపలా నీ జతగా నా హృదయాన్ని లంకెవేయాలని నీముందు ఉంచాను..


నా చుట్టూ ఉన్న ఈ గంభీరమైన మనుషులు కనిపెడతారని భయంతో ఎదురుచూస్తున్నాను నీకోసం..


ఎరుపెక్కిన బుగ్గల నిగ్గు.. నీమీద ప్రేమను అందరికీ చెపుతుందేమోననీ తలుపుతో దాగుడుమూతలు ఆడుతూ ఇక్కడే నక్కి ఉన్నాను.


నువ్వు చూస్తావని కదూ ఇంత ముస్తాబూ చేసుకుంది..ఈ నీలిరంగును పులుముకుంది..కనిపించానా మరి..


ఒంటరి బాటలవెంట నగ్నదేహాల అందాలకై వెతికే నీ చూపులకు నేను కనిపించానా..కలగన్నావా నన్ను..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

పంచాయతీ మెట్లు

గమ్యం తెలియని పాత్రల పయనం "హిమజ్వాల"

అల్లం శేషగి రావు కథ "చీకటి"