Friday, 25 September 2020

నా చిట్టి స్వప్నాల కాలాన్ని..




ఆ పాత గదిని తెరచినప్పుడు గతకాలపు జ్ఞాపకాలు నన్ను చుట్టుకుంటున్నాయి.. 


సగంగా ఆగిపోయిన కోరికలు, తడిఆరక అలజడి రేపుతున్న స్నప్నాలు.. 


అమ్మతో ఆడిన కబుర్లు, సుతారంగా తాకిన నాన్న చేతి స్పర్శలు.. 


మేజాబల్లలో దాచుకున్న పాటల పుస్తకాలు.. చెల్లితో ఆడుకున్న దాగుడు మూతలు..


గంధపు బొమ్మ.. కలర్ టీవీ.. నాన్నను ఎక్కించుకుని తిప్పిన హీరో సైకిల్.. పుస్తకాల సంచి.. ప్రాణంలో ప్రాణమై

పోయిన స్నేహాలు..


ట్రంకు పెట్టెలో నాన్న దాచుకున్న ప్రేమలేఖలు.. అమ్మ పెళ్ళినాటి జరీ పట్టు చీర..


కాలం కరిగిపోయిన చోట నేను వెతుక్కుంటున్నాను.. నా చిట్టి స్వప్నాల కాలాన్ని..


కరువైన అమ్మ ప్రేమను.. దూరమైన నాన్న లాలనను..


నా కంటి కన్నీరుకి అడ్డుగా వస్తున్న ఈ జ్ఞాపకాల ఆలోచనను..నిలిపేయాలని ఉంది.


ఆదమరచి నిదురించాలని ఉంది.. కుదురులేని రాత్రులకు వీడ్కోలు పలకాలనుంది.


విశాలమైన నా ఊహా ప్రపంచాన్ని.. మరో ఆలోచనతో నింపేయాలని ఉంది..


కన్నీటికి కరగని గంభీరత కావాలని ఉంది..


ఈ అలసిన కన్నులతో సుందర దృశ్యాలతో నిండిన కలను కనాలని ఉంది.


No comments:

Post a Comment

నీలోకి ఒలికిపోయాననీ..

ఈరోజుకి రాసే ప్రేమలేఖ ఇది..  కొన్నిసార్లు అనిపిస్తుంది.  నేను నీలోకి ఒలికిపోయాననీ..  నీలోకి వచ్చి చేరాకా హృదయంలోని నిశ్శబ్దానికి...