వర్షం ఇక ఆగేట్టులేదు..




వర్షానికి చిక్కి ఇద్దరం తడిచిన దేహాలతో దారితెలియని దారుల్లో


గాఢంగా హత్తుకుని వణుకుతున్న శరీరాలతో మార్గం కాని మార్గంలో


వాన తడిమిన దేహాలు..చిగురించిన కొత్త కోర్కెలు


వెచ్ఛదనం కోసం వెతుకుతూ.. ఒంటరితనంలోకి


చినుకులు తడిపిన పెదవుల దగ్గరితనంలోకి జారిపోతూ


 ఏకాంతపు ఒడి కౌగిట పెదవులు అమృతాన్నిజుర్రుకుంటున్నాయి..


నీ స్పర్శను అనుభవిస్తున్నాను...చిన్నపిల్లనైపోయి


తడిమే నీచేతులకు కరిగిపోతుంది నా మేను…ఎటుచూడు వర్షమే


ప్రకృతి నన్ను నిన్ను ఓ దారానికి ముడివేసి ఇద్దరిని ఒకటిగా చేసేందుకు వ్రతం పూనిందేమో


ఏకవి కలానికి చిక్కినా మన కథ మంచి కవితైపోతుంది…ఏ పిట్ట చూసినా ఓ ఊసైపోతుంది..


ఏకళ్ళు గమనించినా కన్నెర్ర చెస్తాయి..మరుగున పడిఉన్న దేహపు వాంఛలు మేలుకోకముందే


నన్ను నువ్వు పూర్తిగా ఆక్రమించకముందే ఇటు నుంచీ మరోచోటికి ప్రయాణిద్దాం..


వర్షం ఇక ఆగేట్టులేదు..


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గమ్యం తెలియని పాత్రల పయనం "హిమజ్వాల"

అల్లం శేషగి రావు కథ "చీకటి"

పంచాయతీ మెట్లు