పోస్ట్‌లు

మళ్ళీ మనం ప్రేమను తెచ్చుకునేంత

మళ్ళీ మన ప్రేమను తెచ్చుకునేంత... .................................................    (శ్రీశాంతి) ఈ ముఖం చీకట్లో నీడలు పడి గాయపడింది.. ప్రాణానికి ప్రేమగాయం సెగ తగులుతుంది. చాలా సమీపంగా వచ్చేసిన నీకు తెలియంది కాదు. నా హృదయాన్ని పట్టి పీడిస్తున్న ఆలోచనల వెంట నిశ్చలమైన హృదయం కోసం పడే ఆరాటం.. ఎవరికీ తెలీకుండా నిన్ను దాచుకోవాలని లేదు. నీకు చాలా సమీపంగా వచ్చాను. గాయాలను మాన్పే శక్తి నీ ప్రేమకుందని నమ్మి నువ్వు నా దుఃఖంగా మారేంత వరకూ అదే నమ్మకం మనసు వీగిపోయేంత వరకూ అదే నమ్మకం రొదల వెంట పరుగులు పెట్టేంత వరకూ చేతి నుంచి మృత్యువు జీవాన్ని లాక్కున్నేంత వరకూ అదే అదే నమ్మకం.. నీకెదురుతిరిగి పోట్లాడి మళ్ళీ మన ప్రేమను తెచ్చుకునేంత వరకూ నిన్ను నా సమస్తంగా మార్చుకునేంత పిచ్చి నమ్మకం..

తేదీ మారుతుందా?

మళ్ళీ మన ప్రేమను తెచ్చుకునేంత... .................................................    (శ్రీశాంతి) ఈ ముఖం చీకట్లో నీడలు పడి గాయపడింది.. ప్రాణానికి ప్రేమగాయం సెగ తగులుతుంది. చాలా సమీపంగా వచ్చేసిన నీకు తెలియంది కాదు. నా హృదయాన్ని పట్టి పీడిస్తున్న ఆలోచనల వెంట నిశ్చలమైన హృదయం కోసం పడే ఆరాటం.. ఎవరికీ తెలీకుండా నిన్ను దాచుకోవాలని లేదు. నీకు చాలా సమీపంగా వచ్చాను. గాయాలను మాన్పే శక్తి నీ ప్రేమకుందని నమ్మి నువ్వు నా దుఃఖంగా మారేంత వరకూ అదే నమ్మకం మనసు వీగిపోయేంత వరకూ అదే నమ్మకం రొదల వెంట పరుగులు పెట్టేంత వరకూ చేతి నుంచి మృత్యువు జీవాన్ని లాక్కున్నేంత వరకూ అదే అదే నమ్మకం.. నీకెదురుతిరిగి పోట్లాడి మళ్ళీ మన ప్రేమను తెచ్చుకునేంత వరకూ నిన్ను నా సమస్తంగా మార్చుకునేంత పిచ్చి నమ్మకం..

స్వగతం...

చిత్రం
మబ్బు పట్టడం, వర్షం చినుకు నేలకు రాలినపుడు మట్టివాసనేయడం, గాలిలో ధూళి కణాలు ఎగిరి ముఖాన్ని తాకడం, నీటిలో చిట్టి చేపలు గంతులేయడం. కొబ్బరి ఆకులు గాలికి తలలూపడం, అమ్మ గట్టిగా అదిలించి పిలవడం, నాన్న గుండెల మీద ఆడుకోవడం, ముద్దొచ్చి బుగ్గగిల్లితే నా ఏడుపు నాకే కొత్తగా అనిపించడం అంతా నేను కొత్తగా ప్రపంచంలోకి వచ్చానని తెలిపిన సమయాలు. నా అనే ఎరుకను ఇచ్చిన సందర్భాలు... ఇదే నా ప్రపంచం అని.. ఇక నుంచి నేను ఇక్కడే మనాలని,, గత జన్మ వాసనలు మరిచిపోయి.. కొత్త జన్మలో ఇమిడిపోయిన సందర్భాలు అవి. అన్నీ కొత్తగా వింతగా దోచిన విషయాలివి. నాతో పాటు తోబుట్టువులు, స్నేహితులు, చుట్టాలు ఎందరో, నేను అని, నాకు అని తెలియని రోజుల్లో బాల్యంలోకి చొచ్చుకుని పోయినపుడు నాకు కనిపించే దృశ్యాలు ఎన్నెన్నో.. వాటికి తోడుగా నాకు మిగిలిన జ్ఞాపకాల దొంతరలో తిప్పే ప్రతి పేజీలో ఓకథ. (శ్రీ)     

నిరీక్షణ..

చిత్రం
పాటలన్నీ నిశ్శబ్దంలోకి ఇంకిపోయాయి.. సాయంత్రాలు నీ ఊహను బరువుగా మార్చేసాకా.. మళ్ళీ రాత్రికి తేలియాడే ఆలోచనలు, ఆ వెచ్చని కౌగిలి, ఆ మరిచిపోలేని మైమరపు, నన్ను లాక్కెళ్ళే ఆ గదిలోని అగరబత్తీల వాసన.. నేను నువ్వయిపోయే క్షణాలకు అప్పగించేసుకున్న రాత్రి రాపిడిలో.. ఇంకో రోజు కలగా కరిగిపోయింది. ఇదంతా నీకు అర్థంకాదులే.. ఒంటరిగా కూర్చుని చూడు.. ఆలోచించు    

అవలోకనం..

చిత్రం
మబ్బు పట్టడం, వర్షం చినుకు నేలకు రాలినపుడు మట్టివాసనేయడం, గాలిలో ధూళి కణాలు ఎగిరి ముఖాన్ని తాకడం, నీటిలో చిట్టి చేపలు గంతులేయడం. కొబ్బరి ఆకులు గాలికి తలలూపడం, అమ్మ గట్టిగా అదిలించి పిలవడం, నాన్న గుండెల మీద ఆడుకోవడం, ముద్దొచ్చి బుగ్గగిల్లితే నా ఏడుపు నాకే కొత్తగా అనిపించడం అంతా నేను కొత్తగా ప్రపంచంలోకి వచ్చానని తెలిపిన సమయాలు. నా అనే ఎరుకను ఇచ్చిన సందర్భాలు... ఇదే నా ప్రపంచం అని.. ఇక నుంచి నేను ఇక్కడే మనాలని,, గత జన్మ వాసనలు మరిచిపోయి.. కొత్త జన్మలో ఇమిడిపోయిన సందర్భాలు అవి. అన్నీ కొత్తగా వింతగా దోచిన విషయాలివి. నాతో పాటు తోబుట్టువులు, స్నేహితులు, చుట్టాలు ఎందరో, నేను అని, నాకు అని తెలియని రోజుల్లో బాల్యంలోకి చొచ్చుకుని పోయినపుడు నాకు కనిపించే దృశ్యాలు ఎన్నెన్నో.. వాటికి తోడుగా నాకు మిగిలిన జ్ఞాపకాల దొంతరలో తిప్పే ప్రతి పేజీలో ఓకథ. చిన్నతనం ఎంత గొప్పది.. అప్పుడు కనిపించే దూరాలు, చేసే సాహసాలు, కలిగే ప్రేమలు, దూరం పెట్టేసే చికాకులు.. అన్నీ విడ్డూరమే.. అది నేనేనా అనిపించేంత చిత్రవిచిత్ర సంఘటనలు.. ఎక్కడో నటి చనిపోతే.. ఇక్కడ గొయ్యితీసి, పూలు చల్లి, శిలా ఫలకం పెట్టేంత ఆలోచన ఆ వయసులో కలగడం ఇప...

ఆనందం నన్నడిగేది..

చిత్రం
ఆనందం నన్నడిగేది.. నన్ను ఎక్కడ దాచావని అతని చూపులో, మాటలో, మనసులో, సాంగత్యంలో అన్నాను. హృదయాన్ని వదిలేసానని, నింపుకోలేదని పాపం దానికి అనుమానం నక్షత్రకాంతిలో గాలి రేగింది.. చూపులు కలిసే చోటికి ప్రయాణం ఆనందాన్ని వెతుకుతూ దారికాని దారుల్లోకి.. ఎండుటాకుల శబ్దానికి మల్లే గుండె శబ్దం.. పిలుపు వినిపించేంత దగ్గరగా జీవిత రహస్యాన్ని తెలుసుకున్నట్టుగా.. ఆకాశాన్నంతా పూడుస్తున్నాను, ఇంకా ఆనందం పట్టలేనంత ఉంది. నింపుతున్నాను, అంతటా, అతనితో కలిసి.. ప్రేమ పుష్పాన్ని వికసింపచేయడానికి..   

నీ రూపాన్ని చూసే వీలు లేకపోతే..

చిత్రం
 ఎప్పటికీ నాకు ప్రేమ దొరక్కపోతే.. పగటిని రాత్రి కలిసే చోట కలిసిపోతాను. నీ రూపాన్ని చూసే వీలు లేకపోతే ఉదయకాంతిని అరువడుగుతాను. విషాదాన్ని, ఒంటరితనాన్ని మోయలేక అలలపై విడిచిపెడతాను. అప్పటికీ నువ్వు కనిపించకపోతే అంతులేని విషాదంలోకి దూకిపోతాను. ఉదయాన్ని శపించే వీలులేదుకానీ, లేకుంటే వెలుగునే బహిష్కరిస్తాను. గుస గుసగా ప్రేమ కబుర్లు వినిపిస్తే.., నేల చూపులు చూడలేను.. వెతుకుతాను. అన్నివైపులా నువ్వు కలిపించే దారలంట..