పోస్ట్‌లు

నా ఊహకు ఊతమై..

చిత్రం
ఆకాశాన్ని చూస్తూ ఆలోచిస్తానా  ఎప్పుడో తెలీకుండానే నీ ఊహ  అల్లుకుంటుంది వేల ఊహలను కుప్పగా పోసి  నీ ఊహను కంటాను నేను వెలుగుపరుచుకోని దారులంట నీతో ప్రయాణిస్తాను ప్రకృతి విలాశాన్నంతా  చూసి మనమూ ప్రేమ పక్షులమై వేగం తెలియని పరుగులు  పెడుతూ ఎన్ని మైళ్ళో అలా ఆ చేల పచ్చదనంలో  పసుపద్దుకుంటుంది మన ప్రేమ సూర్యాస్తమయంలో కుంకుమ  దిద్దుకుంటుంది మన చెలిమి చూసి త్వరపడి  కలువలు వికసిస్తాయి వీచే చిరుగాలికి నా నిదుర  చెదరి నీలోకి ఒదిగిపోతాను అలా నిజంలోకి మారానోలేదో పక్కన నిన్ను వెదుక్కుని వెక్కి ఏడుస్తుంది హృదయం నీ కౌగిలి స్పర్శను మరువలేక నీ జ్ఞాపకాలతో గుబులు పడుతుంది తోవ తెలియని పక్షికి మల్లే రెక్కలాడిస్తూ మళ్ళీ నిన్ను వెతకడానికి సిద్ధమవుతాను

మనసు

చిత్రం
ఒకరి చేయి ఒకరం అందుకుని పరుగందుకోలేదూ ఏదీ అప్పుడు! విశ్రమమే లేని పరుగది నా బద్దకాన్నంతా నీకు బదిలీ చేసి నీ ముఖపు కాంతిని నాలోకి ఒంపుకుని నీతో సాగిపోయాను చూడు అప్పటిమాట మేలుకొలుపులోనూ మళ్ళీ నీవే ఈ మనసు ప్రతి కదలికకూ మళ్ళీ నీవే ప్రాణం నీ భుజాన వాలుతుంది గారాలు పోతుంది ఎక్కడికో నీతో ఎగిరిపోవాలనీ ఆశ పాపం.. గడిచిన రోజులన్నీ నావంటుంది..లెక్కవేస్తుంది. ఆ ఎగిరే పిట్టలపై పాట కట్టడం ఇదే చేతనవును దానికి గిరికీలు కొట్టే గాలితో నీకు ప్రేమ సందేశం పంపుతుంది మేలిముసుగులో ముఖాన్ని దాచి నీ పెదవులను అందుకున్నట్టు కలకంటుంది రాలిపడే ఆకులమల్లే ఎన్ని కలలో దానికి

నువ్వు నా అనంతానివి

చిత్రం
ఆ దారిన పోయినట్టు ఆనవాళ్ళు  నీ అడుగుల గుర్తులు మరోమారు చెరిగిపోయి కనిపిస్తాయి నిన్ను కలిసేనాటికి నేను కాలాన్ని  పట్టుకుని నీ అడుగులో అడుగునైపోతాను. నీ ప్రేమకు చిహ్నంగా నీ తలపులతో  నీడనై నీతోనే ఉంటాను. ఈ గుండె మీద నువ్వు పరుచుకున్న  చోటును ఎంతని చెప్పను. కంగారుగా సాగిపోతున్న  సాయంత్రానికి నువ్వో ఆస్వాదనవు తలనిమిరి నుదుటున ముద్దాడినపుడు  నువ్వో చెలికాడివి పున్నమినాడు ఆ చంద్ర కాంతిలో  నీ భుజాన ఆనినపుడు నువ్వు నా అనంతానివి వేగం తెలియని ఈ ఆలోచనలకు  కట్టడి నేర్పిన నా సమస్తానివీ దూరంగా పొద్దు జరిగిపోతున్న చోట  నిన్ను కలవాలని ఎదురుచూస్తున్న నేనో చకోరాన్ని..

నిశ్శబ్దం లోంచి నిశ్శబ్దంలోకి

చిత్రం
ఇంత నిశ్శబ్దాన్ని ఎవరు మోస్తారు సుడులు తిరిగే ఆలోచనలు నిండుకున్న కోరికలు నీ చేతుల బిగింపులో  ఓడిపోయిన దేహం ఎప్పుడు వినగలనో నీ స్వరాన్ని నడిరాతిరి నీ తలపుల అలజడిలో చీకటి పొదల మాటున నిన్ను కల కంటాను జ్వలిస్తున్న నా కళ్ళల్లోని  కాంతులు వెదజల్లే మోము నీదేనా వేడి నిట్టూర్పుల మధ్య అలవాటైపోయిన నీ చేతి స్పర్శ నిశ్శబ్దం అంతా నిశ్శబ్దం నువ్వున్నావన్న ఆశ మచ్చుకైనా లేదు నీ తలపులు వేల వేల ప్రశ్నలై  వేధిస్తున్నాయి నన్ను ఈ గుండెల్లోని దిగులు నిశ్శబ్దం లోంచి నిశ్శబ్దంలోకి ప్రయాణిస్తుంది

ప్రియా..ఏవి నీ చేతులు

చిత్రం
నిశ్చలమైన నది పై  ప్రయాణిస్తున్నాను నదిని దాటి నిన్ను  చేరాలని ఆశ లోపల ఈ తెరచాటు పరదాలో నా  ముఖాన్ని దాచుకున్నాను శూన్యాన్ని ప్రశన్నంగా చూస్తూ లోపలి దిగులు నీకు మాత్రమే చెప్పాలనీ చీకటిని ప్రశ్నిస్తూ వెలుగు వెలుగును ప్రశ్నిస్తూ చీకటి పోటీ పడుతున్నాయి. నీటి లోపలి రాళ్ళు నవ్వుతున్నాయి.. చిట్టి చేపల అల్లరి, నీటి బాతుల ఊసులు చెప్పనే అక్కరలేదు అక్కడే నేను ఎదురు  చూస్తున్నాను ప్రియా.. ఏవి నీ చేతులు  నన్ను చుట్టేందుకు గమ్యం తెలీని ప్రయాణంలో నీ తలపే వెలుగు  ఈ దేహానికి నీ కౌగిలే మందు..

ఎంతకోత..ఈ హృదయానికి

చిత్రం
వంకర్లు తిరిగి గాలితో  కలిసి ప్రయాణిస్తున్న  ధూళికణాల మూకతో  కబురంపాను ఎంత రొద ఈ హృదయానికి నీ మౌనంతో ఎంత కోత  గుండెకు  కన్నీటితో  వెనక్కువెళ్ళి  మన మజిలీలను  కలుపుకుని వస్తున్నాను బరువెక్కిన మనసుకు  ఎవరు చికిత్స చేస్తారు ఎందుకు ఈ అలంకారమో  నీ చూపు సోకని నా మేనుకు మెరుపులేదు నిముషాలకు వెలకట్టి  నిన్ను ఎత్తుకురమ్మన్నాను నీ స్పర్శ లేని దేహం  ఇరుకై నన్ను వేధిస్తుంది భారంగా జరిగే రోజుతో  కునికిపాట్లు పడుతున్నాను ఏమౌతానో తెలీని నీ  ఆలోచనలతో సావాసం రోజంతా

అడిగి చూడు..

చిత్రం
కాలాన్ని లెక్కపెట్టు ఎన్ని దోసిళ్ళ నవ్వులు నీకందిస్తుందో మండిపడిపోతున్న సూరీణ్ణి కళ్ళప్పగించి చూసే బలాన్ని ఇమ్మను తొడిమలేని సన్నజాజులు పెట్టే సువాసనల చక్కిలిగిలిని  ఆస్వాదించు చంద్రుడు గిల్లిన వెన్నెలను అడుగు మనసెన్ని సార్లు పారేసుకుందో ఎర్రగా పండిన తాంబూలాన్ని అడుగు ఎవరి మనసు పండించిందో విచ్చుకున్న పూరేకుల అందాలను గిచ్చుకుపోయే తుమ్మెదనడుగు ఆ ఆత్రం ఎందుకనీ నీ నీలి కన్నుల్లో దాచిన నా  రూపాన్ని అడుగు ఎప్పుడు ప్రేమ పుట్టిందనీ