పోస్ట్‌లు

అమరావతి కథల పై సమీక్ష

చిత్రం
సత్యం శంకరమంచి "అమరావతి కథలు" పై నా సమీక్ష కినిగె పత్రికలో .  “అల్లంత దూరాన మబ్బుల్ని తాకుతున్న గాలిగోపురం. ఆ వెనుక సూర్యకిరణాల పలకరింపుకు మెరుస్తున్న బంగారుపూత అమరేశ్వరాలయ శిఖరం. ఎత్తయిన ఆ శిఖరానికి చుట్టూతా ఎన్నో ఆలయాలు. ఎన్నెన్నో శిఖరాలు. తూర్పున వైకుంఠపురం కొండ, దక్షిణాన పాడుపడ్డ బౌద్ధ స్తూపాలు, పడమట ఈనాడు దిబ్బగా మారిన అల్లప్పటి శాతవాహనుల రాజధాని ధాన్యకటకం, ఉత్తరాన ఆ స్తూపాల్ని, ఆ దిబ్బల్ని వాటిమధ్య ఉండే ప్రజల్ని, ఆ ఊర్ని వడ్డాణంలా చుట్టి గల గల పారుతున్న కృష్టానది. అద్గదీ అమరావతి.” అమరావతి కథలు సత్యం శంకరమంచి రచించిన 100 కథల సంపుటి. సత్యంగారి రచనకు బాపూ గారి బొమ్మలు, ముళ్ళపూడి వెంకట రమణగారి ముందు మాట మరింత వన్నెతెచ్చాయి. ఈ కథల్లో తనకు పరిచయమున్న ఊరిని, ఊరివారినీ మనకు పరిచయం చేసారు. కథ నిడివి చిన్నదైనా కథ చెప్పిన తీరు, కథా   విషయం నిరాడంబరంగా ఉంది. అమరావతి ఊరితో ఆయనకున్న అనుబంధం ప్రతీ కథలోనూ కనిపిస్తుంది. రాజులు, దొరలు, దొంగలూ, సామాన్య ప్రజలూ, అందరూ కథా పాత్రలే. ఒకింత హాస్యము, వ్యంగ్యమూ కలబోసి చెప్తారు. ప్రతీ కథా క్లుప్తంగా, సూటిగా, మనసుకు హత్తుకునే విధంగా ఉం...

నా మొదటి కథ "పొరుగింటమ్మాయి"

చిత్రం
నా మొదటి కథ "పొరుగింటమ్మాయి" http://patrika.kinige.com/?p=1038&view-all=1  కినిగె పత్రికలో చదవండి. ప్రపంచం అంతా నిద్రావస్థలో ఉంది. నాకు మాత్రం నిద్ర కరువయింది. మనసెందుకో అలజడిగా , అలసటగా ఉంది. వీధి తలుపు తెరిచి గేటు దగ్గరకు వచ్చాను. పోనీ వాకింగ్ కు వెళదామన్నా తెల్లవారడానికి ఇంకా చాలా సమయమే ఉంది. మా వీధిలో ఎప్పుడూ వెలిగే ఆ కాసిని దీపాలు ఈ రోజు వెలగడం లేదు. ఎదురింట్లో మాత్రం పెద్దగా లైట్లు వెలుగుతున్నాయి. ఆ ఇంటి నుండి చిన్నగా ఎవరివో ఆడవారి ఏడుపులు వినిపిస్తున్నాయి. చెవులు రిక్కించి అక్కడ నేను విన్నది ఏడుపేనని మరోసారి రూఢీ చేసుకున్నాను. రాకూడని కష్టం ఏదో వచ్చిందా కుటుంబానికి. ఏం జరిగిందో తెలియాలంటే తెల్లవారాలి. అంతవరకు నా మనసు ఆగలేదు , ఏం జరిగిందో తెలుసుకోవాలి. కానీ నేను వెళ్ళినా వాళ్ళు బహుశా నన్ను గుర్తుపట్టకపోవచ్చు , ఎందుకంటే ఉద్యోగ కారణంగా నేను నెలలో ఇంటి పట్టున ఉండేది చాలా తక్కువ. నాకు అంతగా ఎవరితోనూ పరిచయాలు లేవు. వెంటనే ఓ ఆలోచన వచ్చింది. నా భార్య నాలా కాదు , అందర్నీ కలుపుకుపోయే మనిషి. ఒకటి రెండు సార్లు ఎదురింటి వారి గురించి ఏదో మాట్లాడటం విన్...

బంధనాల స్వభావాన్ని చిత్రించే “స్వేచ్ఛ”

చిత్రం
ఓల్గా గారి నవల "స్వేచ్ఛ" రివ్యూ కినిగె పత్రిక డిసెంబరు సంచికలో పడింది. దాని లింక్:  http://patrika.kinige.com/?p=355&view-all=1 పిడిఎఫ్ లింక్:  http://patrika.kinige.com/wp-content/uploads/2013/12/Review-of-Swetcha.pdf ఈ పుస్తకానికి రాసిన పరిచయంలో రచయిత  ఓల్గా  స్వేచ్ఛ గురించి ఇలా అంటారు: ఈ  స్వేచ్ఛ  ఎవరో ఒకరు ఇచ్చేది కాదు. ఎవరి దగ్గర నుండి సాధించుకునేది కాదు. మన అవసరాలను, మన ఉనికికి అత్యవసరమైన విషయాలను మనం గుర్తించడమే స్వేచ్ఛ. నిజానికి ఇది సాధించడమే చాలా కష్టం. మన నుండి మనకు స్వేచ్ఛ. మనకు పుట్టుక నుండీ అలవాటైన భావాల నుండీ అభిప్రాయాల నుండీ ఆచారాల నుండీ స్వేచ్ఛ. మనలో జీర్ణించుకు పోయిన నమ్మకాల నుండీ విడుదల. అరుణ ఎమ్మే ఆఖరి సంవత్సరం పరిక్షలు రాసింది. మధ్యతరగతి కుటుబంలో పుట్టి పెరిగిన ఆమె చిన్న నాటి నుండి అదుపాజ్ఞలతో పెరిగింది. వయసు రాగానే తండ్రీ, అన్నగారూ అరుణకు హద్దులు నిర్ణయించేవారు. దీనికి కొంత కారణం అరుణ మేనత్త కనకమ్మ, భర్త చిన్నవయసులోనే చనిపోవడంతో తమ్ముడి (అరుణ తండ్రి) ఇంటికి కొంత ఆస్తితో చేరింది. వయసులో జరగాల్సిన ముచ్చ...

విలువల్ని నిలదీసే శారద నవలలు

చిత్రం
శారద గారి అసలు పేరు ఎస్. నటరాజన్ గారు. ఈయన తమిళదేశస్తుడు. పన్నెండేళ్ళప్పుడు తెనాలి వచ్చారు. చిన్ననాటి నుండి తమిళ సాహిత్యంపై మక్కువతో ఆ వయసులోనే పలు రచనలు చదవారు. తనకున్న పఠనాశక్తి వల్ల తెనాలి రాగానే తెలుగు భాష కూడా నేర్చుకొని ఎన్నో రచనలు చదవడమే కాక తోటివారికి చెపుతుండేవారు. నటరాజన్ గారు తెలుగు భాషలో పలు కథా, నవలా రచనలను చేసారు. వారి మొదటి రచన “ప్రపంచానికి జబ్బు చేసింది”. ఆయన రచనల్లో నేను ప్రస్తుతం చదివింది పర్‌స్పెక్టివ్స్ వాళ్లు ప్రచురించిన “శారద నవలలు”. ఇందులో మెుత్తం మూడు నవలలు ఉన్నాయి. అవి: “ఏది సత్యం”, “మంచీ చెడు”, “అపస్వరాలు”. ఏది సత్యం పార్వతి భర్త సాంబశివరావు. రైసు మిల్లులో సూపర్ వైజర్ గా పనికి కుదిరాడు. వారి సంసారం చక్కగా సాగుతున్న తరుణంలో, సాంబశివరావుకు రైసు మిల్లులో ఒక ప్రమాదం జరిగి కాలు విరిగిపోతుంది. అప్పటి వరకు ఎంతో సంతోషంగా, సుఖంగా సాగుతున్న వారి సంసారంలో కష్టాలు ప్రవేశించాయి. ఇల్లు గడవడం భారంగా మారింది. సంసార భాధ్యత అమాయకురాలైన పార్వతి పై పడింది. పొరుగింటి వారి సహాయంతో చిన్న ఉద్యోగంలో చేరింది పార్వతి. పార్వతి ఉద్యోగం చేయడం సాంబశివరావుకు ఇష్టం ఉందదు గానీ, పొరుగ...

గమ్యం తెలియని పాత్రల పయనం "హిమజ్వాల"

చిత్రం
హిమజ్వాల నవల వడ్డెర చండీదాస్ రచించారు. కథ ప్రారంభంలో గజి బిజిగా అనిపించింది. నెమ్మదిగా పాత్రల స్వభావాలను అర్థం చేసుకుంటూ కథలోని ఉద్దేశాన్ని తెలుసుకోడానికి పూర్తిగా చదివాను. ఈ కథ మనిషి మనసు ఎన్ని రకాలుగా మారుతుందో ఎలాంటి నిర్ణయాలను తీసుకునేలా చేస్తుందో తెలుపుతుంది. కృష్ణచైతన్య, గీతాదేవి అనే పాత్రల చుట్టూ నడుస్తుంది కథ. కథావిషయం:— ఉన్నతమైన కుటుంబానికి చెందిన కృష్ణచైతన్య కాలేజీ లెక్చరర్. ఒకనాడు రోడ్డు మీద అతనికి అపస్మారక స్థితిలో తారసపడుతుంది గీతాదేవి. ఆమెది మధ్యతరగతికి కుటుంబ నేపథ్యమైనా ఉన్నత చదువులు చదివింది. ఒంటరిగా ఉన్న అతనికి మొదటిసారిగా ఆమెపై కలిగిన  అనురాగం ఆరాధనలను ప్రేమ పూర్వకంగా కాక కోరికగా తెలుపుతాడు. అతని నుండి ఆమె దూరంగా వెళిపోతుంది. బొంబాయిలో ఉన్న స్నేహితురాలి దగ్గరకు చేరుతుంది. అక్కడ స్నేహితురాలి భర్త ఆమెను వేధించటంతో, చివరకు కృష్ణచైతన్య స్నేహితుడైన శశాంక్ సహాయంతో ఒక పత్రికలో చేరుతుంది. కొన్నాళ్ళకు లెక్చరర్ గా స్థిర పడుతుంది. అక్కడే శివరాం తో పరిచయం అవుతుంది. ఆ పరిచయం కొన్నాళ్ళకు ప్రేమగా మారి పెళ్ళికి దారితీస్తుంది. అతనితో కొత్తజీవితం కొన్నాళ్ళు సరదాగా సాగు...

మునెమ్మ ప్రతీకారం...

చిత్రం
మునెమ్మ నవల 2008లో ప్రచురితమైంది. రచయిత డాక్టర్ కేశవరెడ్డి. కథా విషయం:–  మునెమ్మ పల్లెటూరి పడుచు. జయరాముడు ఆమె భర్త. అతను మొరటుదనం, కరుకుదనం కలిగిన మనిషి. తనకు తోచింది తప్ప ఎవరి మాటా వినే రకం కాదు.  మునెమ్మ అత్తవారింట కాపురానికి వచ్చిన రోజే పుట్టిన బొల్లిగిత్త అంటే ఆమెకూ, కుటుంబ సభ్యులకే కాదు, ఆ ఊరి వారందరికీ ఇష్టమే. వీధిలో పోతూ ఉంటే జయరాముణ్ణీ, బొల్లిగిత్తనూ రామలక్ష్మణులనేవారు. బొల్లిగిత్తను తమ బిడ్డగా భావించి మునెమ్మ జయరాములిద్దరూ తమ చేతి మీద దాని బొమ్మ పచ్చ పొడిపించుకుంటారు. ఆ బొల్లిగిత్త వారి జీవనాధారం కూడా.  ఒకరోజు బొల్లిగిత్త మునెమ్మ మీదకు రెండు కాళ్లతో లేచి లైంగిక చేష్ట లాంటిది ప్రదర్శించటం చూసిన జయరాముడు రెచ్చిపోయి పారతో దాడి చేస్తాడు. చావబాదినా బొల్లిగిత్తపై కోపం తగ్గక దాన్ని సంత (పరస)లో అమ్మేసి కొత్త గిత్తను కొంటానని అక్కణ్ణించి ఆవేశంగా వెళిపోతాడు. ఈ సన్నివేశంతోనే కథ మొదలవుతుంది. ఈ కథ అంతట్నీ మనకు చెప్పేది జయరాముడి దూరపు చుట్టమైన సినబ్బ.  జయరాముని తల్లి సాయమ్మ బొల్లిగిత్తను జయరాముడు చావబాదాడని మునెమ్మ ద్వారా తెలుసుకుంటుంది. ...

ఆశ నిరాశల దోబూచులాట “ఊరి చివర ఇల్లు”

చిత్రం
అమృతం కురిసిన రాత్రి అందరూ నిద్రపోయే వేళ దోసిళ్ల కొద్దీ అమృతాన్ని తాగిన కవిగానే తిలక్ నాకు తెలుసు. ఈ కథతో ఆయన నాకు కథకునిగా మొదటిసారి పరిచయం అయ్యాడు. కథా విషయం:– ఊరికి దూరంగా పచ్చని పొలాల నడుమ, చింత చెట్లు తుమ్మ చెట్ల మధ్య, చూరు వంగి, గోడలు బెల్లులు ఊడి ఉందా ఇల్లు. మనుష్య సంచారం ఆ ఇంట ఉందా అనే సందేహం కలగక మానదు కొత్త వారికి. ఆ ఇంటిలో ఒక యువతి, ఆమెతో పాటు ఒక అవ్వ ఉన్నారు. వాతావరణం దట్టమైన మబ్బులతో కప్పి ఉండి వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. ఇరవై మూడేళ్ళ ఆ యువతి ఇంటి వరండా లోంచి అలా కురుస్తున్న వర్షాన్ని చూస్తూంది. తనలో రేగుతోన్న ఆలోచనలకు, దిగులుకు, దుఃఖానికి రూపాన్ని వెతుకుతున్నట్లు ఉన్నాయామె శూన్యపు చూపులు. రోడ్డంతా గతుకులతో బురదతో నిండి ఉంది. వర్షపు నీరు ఆ ఇంటిముందు కాలువలుగా ప్రవహిస్తుంది. చలిగాలి కూడా తోడయింది ఆ వాతావరణానికి. అంతలో వర్షంలో తడుస్తూ, బురదలో కాళ్లీడ్చుకుంటూ ఆ ఇంటి మందుకు వచ్చాడో యువకుడు. తాను తన మిత్రుణ్ణి కలవడానికి గాను ఈ ఊరు రావలసి వచ్చిందని, తిరిగి రైల్వే స్టేషన్‌ వెళ్లాల్సిన తనకు వర్షం అడ్డంకిగా మారిందని అంటాడు. ఈ రాత్రి ఇక్కడే ఉండి వాన తెరిపిచ్చాకా ...