పోస్ట్‌లు

మునెమ్మ ప్రతీకారం...

చిత్రం
మునెమ్మ నవల 2008లో ప్రచురితమైంది. రచయిత డాక్టర్ కేశవరెడ్డి. కథా విషయం:–  మునెమ్మ పల్లెటూరి పడుచు. జయరాముడు ఆమె భర్త. అతను మొరటుదనం, కరుకుదనం కలిగిన మనిషి. తనకు తోచింది తప్ప ఎవరి మాటా వినే రకం కాదు.  మునెమ్మ అత్తవారింట కాపురానికి వచ్చిన రోజే పుట్టిన బొల్లిగిత్త అంటే ఆమెకూ, కుటుంబ సభ్యులకే కాదు, ఆ ఊరి వారందరికీ ఇష్టమే. వీధిలో పోతూ ఉంటే జయరాముణ్ణీ, బొల్లిగిత్తనూ రామలక్ష్మణులనేవారు. బొల్లిగిత్తను తమ బిడ్డగా భావించి మునెమ్మ జయరాములిద్దరూ తమ చేతి మీద దాని బొమ్మ పచ్చ పొడిపించుకుంటారు. ఆ బొల్లిగిత్త వారి జీవనాధారం కూడా.  ఒకరోజు బొల్లిగిత్త మునెమ్మ మీదకు రెండు కాళ్లతో లేచి లైంగిక చేష్ట లాంటిది ప్రదర్శించటం చూసిన జయరాముడు రెచ్చిపోయి పారతో దాడి చేస్తాడు. చావబాదినా బొల్లిగిత్తపై కోపం తగ్గక దాన్ని సంత (పరస)లో అమ్మేసి కొత్త గిత్తను కొంటానని అక్కణ్ణించి ఆవేశంగా వెళిపోతాడు. ఈ సన్నివేశంతోనే కథ మొదలవుతుంది. ఈ కథ అంతట్నీ మనకు చెప్పేది జయరాముడి దూరపు చుట్టమైన సినబ్బ.  జయరాముని తల్లి సాయమ్మ బొల్లిగిత్తను జయరాముడు చావబాదాడని మునెమ్మ ద్వారా తెలుసుకుంటుంది. ...

ఆశ నిరాశల దోబూచులాట “ఊరి చివర ఇల్లు”

చిత్రం
అమృతం కురిసిన రాత్రి అందరూ నిద్రపోయే వేళ దోసిళ్ల కొద్దీ అమృతాన్ని తాగిన కవిగానే తిలక్ నాకు తెలుసు. ఈ కథతో ఆయన నాకు కథకునిగా మొదటిసారి పరిచయం అయ్యాడు. కథా విషయం:– ఊరికి దూరంగా పచ్చని పొలాల నడుమ, చింత చెట్లు తుమ్మ చెట్ల మధ్య, చూరు వంగి, గోడలు బెల్లులు ఊడి ఉందా ఇల్లు. మనుష్య సంచారం ఆ ఇంట ఉందా అనే సందేహం కలగక మానదు కొత్త వారికి. ఆ ఇంటిలో ఒక యువతి, ఆమెతో పాటు ఒక అవ్వ ఉన్నారు. వాతావరణం దట్టమైన మబ్బులతో కప్పి ఉండి వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. ఇరవై మూడేళ్ళ ఆ యువతి ఇంటి వరండా లోంచి అలా కురుస్తున్న వర్షాన్ని చూస్తూంది. తనలో రేగుతోన్న ఆలోచనలకు, దిగులుకు, దుఃఖానికి రూపాన్ని వెతుకుతున్నట్లు ఉన్నాయామె శూన్యపు చూపులు. రోడ్డంతా గతుకులతో బురదతో నిండి ఉంది. వర్షపు నీరు ఆ ఇంటిముందు కాలువలుగా ప్రవహిస్తుంది. చలిగాలి కూడా తోడయింది ఆ వాతావరణానికి. అంతలో వర్షంలో తడుస్తూ, బురదలో కాళ్లీడ్చుకుంటూ ఆ ఇంటి మందుకు వచ్చాడో యువకుడు. తాను తన మిత్రుణ్ణి కలవడానికి గాను ఈ ఊరు రావలసి వచ్చిందని, తిరిగి రైల్వే స్టేషన్‌ వెళ్లాల్సిన తనకు వర్షం అడ్డంకిగా మారిందని అంటాడు. ఈ రాత్రి ఇక్కడే ఉండి వాన తెరిపిచ్చాకా ...

ఉత్కంఠ భరితం "చంద్రగిరి శిఖరం"

చిత్రం
బిభూతి భూషణ్ గారు బెంగాలీలో ప్రముఖ రచయిత. పదహారుకు పైగా నవలలూ, రెండొందల పైచిలుకు కథలూ రాశాడు. వాటిలో బాగా ప్రసిద్ధి పొందినవి “పథేర్ పాంచాలి”, “అపరాజితుడు”, “వనవాసి” అనే మూడు నవలలు. ఇవన్నీ ఇదివరకే తెలుగులో వచ్చాయి. ఇపుడు వీటిలా ఆత్మకథాత్మకంగా కాక, కాల్పనిక శైలిలో రచించిన “చంద్రగిరి శిఖరం” (చందే పహార్) కూడా కాత్యాయని గారి అనువాదంతో తెలుగులో వచ్చింది. స్వతహాగా ప్రకృతి ఆరాధకుడైన బిభూతి భూషణ్ ఈ నవలలో ప్రకృతి సౌందర్యాన్ని, అందులోని విలయాలను, వింతలను, విశేషాలను కళ్ళకు కట్టినట్టు వర్ణిస్తారు. కథా విషయం:- శంకర్ ఓ పల్లెటూరి కుర్రవాడు. చదువు పూర్తి చేసుకొని గ్రామానికి వస్తాడు. కుటుంబ పరిస్థితుల వల్ల కెన్యాలోని మెుంబాసా దగ్గర రైల్వేశాఖలో గుమస్తాగా పనిలో చేరతాడు. అత్యంత ప్రమాద భరితమైన ఆ ప్రాంతం మానవుని రక్తాన్ని మరిగిన సింహాలకు నిలయమని తెలుసుకుని అక్కడికి ముఫ్పై మైళ్ల దూరంలోని కిసుమూ రైల్వే స్టేషన్‌కి స్టేషన్ మాస్టరుగా కొత్త ఉద్యోగంలో చేరతాడు. అక్కడ జనసంచారం తక్కువ. ఒక రోజు ఆ అటవీ ప్రాతంలో ఒక పోర్చుగీసు యాత్రికుడు డిగో అల్వరేజ్ అపస్మారక స్థితిలో కనిపిస్తాడు. శంకర్ అతణ్ని బతికిస్తాడు. అతను వ...

మనం కోల్పోయిన ప్రపంచాన్ని గుర్తు చేసే "బంగారు మురుగు"

చిత్రం
శ్రీరమణ గారు రాసిన "బంగారు మురుగు" కథ చదివాకా, నా బాల్యం గుర్తుకు వచ్చింది. బామ్మ అందరికీ బాల్యపు తీపి గుర్తు. ఈ కథ చదువుతుంటే, మా బామ్మ కూడా ఇలానే ఉండేది అనో, ఇలాంటి బామ్మ నాకూ ఉంటే ఎంత బాగుండేది అనో అనుకోని వారు ఉండరు. ఇది అరవై ఏళ్ల బామ్మకూ, ఆరేళ్ల మనవడికీ మధ్య సాగే కథగా మాత్రమే గాక, మన మధ్య జరుగుతున్నదా అన్నట్టూ, ఆ కథలో మనమూ పాత్రలై ఉన్నామా అనిపించేట్టూ సాగుతుంది. గట్టి పిండంగా పేరు తెచ్చుకున్న బామ్మకు మనవడన్నా, తన చేతికున్న బంగారు మురుగు అన్నా, తాను పుట్టింటి నుంచి కాపురానికి వస్తూ తెచ్చుకున్న పెరటిలోని బాదం చెట్టన్నా ప్రాణసమానాలు. ఈ బాదం చెట్టే బామ్మా మనవళ్ల స్థావరం. ఇద్దరికీ రోజులో మూడు వంతులు అక్కడే కాలక్షేపం. బామ్మ తత్త్వం ఎవరికీ బోధపడదు. ఎదుటివారిని మాట్లాడనీయక, తన దైన వాగ్ధాటితో, ప్రేమావాత్సల్యంతో అబద్ధం చెప్పాలనుకున్న వారితో కూడా నిజం చెప్పించగలదు. కొడుకూ కోడలూ ఆస్తిని స్వామీజీలకు కైంకర్యం చేస్తూంటారు. బామ్మ మాత్రం వచ్చే పోయే స్వామిజీలను ఆటపట్టిస్తూంటుంది. ఒక స్వామీజీ దృష్టి బామ్మ బంగారు మురుగు మీద పడుతుంది. దాన్ని ఎలాగైనా తనకు దక్షిణగా దక్కించుకోవాలని ప్రయ...

అల్లం శేషగి రావు కథ "చీకటి"

చిత్రం
“చీకటి”... ఇది ఇంత అందంగా ఉంటుందని నాకు తెలీదు. నా మనసుకు హత్తుకున్న ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది ఈ కథ. నేను ఈ మధ్య చదివిన కథల్లో వర్ణనలతో కూడినది, మేధస్సుకు పదును పెట్టే శైలితో నన్ను ఆకట్టుకున్నదీ ఈ కథ. ఇది ఇద్దరి వ్యక్తులకు మధ్య జరిగే సంభాషణ. వారిలో ఒకరి జీవితంలో జరిగిన సంఘటనల సమాహరం. ప్రతీ మనిషికీ ఒక కథ ఉంటుంది. అది చెప్పుకునే సందర్భాలు చాలా తక్కువగా వస్తాయి. అది ఎవరికి చెప్పాలో కూడా మనం నిర్ణయించుకోం. కానీ కాలగమనంలో మనకు తారసపడే వ్యక్తులలో మనసుకు నచ్చిన వారితో సందర్భానుసారంగా మన జీవితాన్ని ఆవిష్కరించుకోవడం జరుగుతుంది. ఎవరు గొప్పా, ఎవరు తక్కువ అన్నది చూపకుండా ఇద్దరినీ స్నేహితులుగా చూపుతూ, చదువుతోనే రాని, లేని జ్ఞానాన్ని చూపుతూ కథ నడిపిన తీరు నాకు నచ్చింది. ప్రకృతిని ఇష్టపడే వ్యక్తులు చాలామందే ఉంటారు, కానీ చీకటిని ఇష్టపడేవారు చాలా తక్కువ.  మన లోకం వెలుగు ఉన్నంత వరకే. కానీ దీపం వెలుతురు లేని చీకట్లోనూ అందం ఉందని ఈ కథ చెప్తుంది. పాఠకుడు ఈ కథ చదువుతున్నపుడు తన మదిలో ప్రతీ దృశ్యాన్నీ ఆవిష్కరించుకోవడం జరుగుతుంది. ప్రతీ దృశ్యం మన ముందే జరుగుతుందనే మాయాజాలం చేయటం రచయిత గొప్పదనం....

జీవం

చిత్రం
నా సుగంధ పరిమళాలు  దిగంతాలు వ్యాపించడం తెలుసు ఏటి ఒడ్డున నిలుచున్న నాకు నీటి గలగలలు తెలుసు నా నీడన శయనించిన ప్రేమ జంటల కిలకిలలు తెలుసు ప్రతి వెన్నెల రాత్రి నెలరాజు పలకరింపుగా నవ్వింది తెలుసు పక్షులు నాపై వాలి పాడిన విరహగీతాలు తెలుసు చిట్టి చేపలు నీట తేలి నా నీడతో సయ్యాటలాడటం తెలుసు కానీ ఇప్పుడన్నీ  చాలా దూరంగా  పారిపోయాయి  ఎందుకనో మరి నాలో  పూర్వపు జీవం లేదనో ఆకులు రాలి పువ్వులు వడలి మోడుగా మిగిలాననో

శ్రీకారం

లోపల అలలుగా వచ్చే ఆలోచనల్ని ఇక్కడ వెలిబుచ్చుకోవాలనుకుంటున్నాను. ఇది నా మొదటి బ్లాగు. ఏదో డైరీ రాతలు తప్ప పెద్దగా రాసిన అనుభవం కూడా లేదు. ఈ బ్లాగు అలవాటైనా నాకు రాయడం నేర్పుతుందని ఆశ. తప్పులుంటే క్షమించి ప్రోత్సహించండి. మంచి సూచనలు చేస్తారని ఆశిస్తున్నాను.