వదలని నీడలు




గాలికి తలలూపే పచ్చని 

చెట్ల నీడలు

మౌనాన్ని వీడని 

నిటారైన స్తంభాలు

జలపాతమంత దుఃఖాన్ని 

మింగిన మనుషులు

నూనె దీపాల వెలుగులో 

ప్రకాశించే నీడలు

పరవశం ఎరుగని 

మనసుల నీడలు

అలజడే ఆనవాలుగా 

సాగిపోతున్న గుండెలు

నిదురను ఎరుగని 

బ్రతుకులు

సేదతీరేందుకు

ఎదురు చూపులు

నీడలు ఎన్ని నీడలో 

దారులంట 

ఆర్తిగా ఆనందాన్ని

వెతుకుతూ పోతున్న నీడలు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గమ్యం తెలియని పాత్రల పయనం "హిమజ్వాల"

అల్లం శేషగి రావు కథ "చీకటి"

పంచాయతీ మెట్లు