ఒక చిరునవ్వును వెతుకుతూ




ఎందుకు మీరంతా 

నన్ను చూసి కన్నీళ్ళను 

ఆరబోసుకుంటున్నారు

నేను దుఃఖాన్ని 

మోయడం లేదు

ఆనందపు జాడలను 

వెతుకుతున్నాను

వర్షించే మేఘాన్ని 

కలగంటున్నాను

పసికందుల నవ్వులను 

తెంపుకుంటున్నాను

పూల మకరందాన్ని 

దోసిళ్ళతో ఎత్తుకుంటున్నాను

ఆకాశం పరిచిన మేఘల నీడలంట

ప్రయాణిస్తున్నాను

గమనమెరిన దిశ నాది

అలుపెరుగని పయనం

దుఃఖమే లేని లోకాలను 

పట్టుకుందుకు

చిరునవ్వుల చిరునామా 

తెలుసుకుందుకు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గమ్యం తెలియని పాత్రల పయనం "హిమజ్వాల"

అల్లం శేషగి రావు కథ "చీకటి"

పంచాయతీ మెట్లు