పోస్ట్‌లు

ఏప్రిల్, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

నమ్మకం...

చిత్రం
రైల్ ఇంజన్ మోత ఊరి కట్టవ దాటి వినిపిస్తుంది. కట్టెలమోపు తలకెత్తుకుని నడుస్తున్న చిట్టెమ్మ దూరంగా ఉన్న కూతుర్ని గట్టిగా పిలుస్తుంది. రైసుమిల్లులోని ధాన్యం ముక్కిన వాసన గంథిగాడి కొట్లోంచి వస్తున్న అగరబత్తీల సుగంధాన్ని కమ్మేసింది. ఆ సాయంత్రవేళ తాటితోపు దాటి సైకిల్ మీద రైయ్ మని పోతున్నాను. నిన్నరాత్రి ఇంట్లో జరిగిన గొడవ సంగతి ఆలోచిస్తూ...సడెన్ గా.. నా ఎదురుగా వస్తున్న సైకిల్ రాసుకుపోయింది. కాస్తలో పెద్ద ప్రమాదం తప్పింది. రాసుకుపోయిందో, ఎక్కడన్నా గీరుకుందో,.. ఆగి చూసుకుని మళ్లీ తొక్కుతున్నాను. స్కూలు దాటి గుర్కావోళ్ళ బీడు దాటి మలుపుతిప్పాను.. ఊళ్ళోకి. ** గుమ్మం తెర పక్కకు జరిపి బయటకు వచ్చింది వెంకటలక్ష్మి. ఎత్తరుగు మీద కూర్చోమంటూ సైగచేస్తూ... గరుకునేల, పక్కనే కోడి గంపలు.. ఒకటే రెట్టల కంపు.. తలెత్తితే పైన కప్పులోంచి దూలంమీదకు ఎగిరి కూర్చున్న కోడిపుంజు నా వంకే చూస్తుంది. తోకెత్తుతూ.. కాస్త పక్కకు జరిగాను. నిటారుగా కార్చోడానికి నానా తంటాలు పడుతూ.. లోపలికన్నా పిలవచ్చుగా.... అంతే మొద్దులంటే అందరికీ లోకువే.. దీనికి మరీను. పైగా ప్రాణ స్నేహితురాలు..నేనంటే ఇంత చిన్నచూపున్నా....

ముళ్ళు....

చిత్రం
తెలతెల్లవారుతుంది. రాత్రి ప్రయాణం వల్లేమో పెద్దగా సమయం తెలీలేదు. నిద్రలోనే హైదరాబాద్ వచ్చేసాం. సికింద్రాబాద్ స్టేషన్ రాగానే దిగాల్సినవాళ్ళంతా నిద్రమత్తులో సామాన్లు గాలించి పట్టుకుని, పాచిముఖాలు సరిచేసుకుంటున్నారు. కొందరిలో ఇంకా అదే మత్తు. కీచుమని శబ్దం చేసుకుంటూ స్టేషన్లో ఆగింది రైలు. ట్రైన్ కంపార్ట్ మెంట్ అంతా రొచ్చుకంపు. ముక్కులు మూసుకుంటూ, తోసుకుంటూ సామాన్లు దింపుకుంటున్నారు. ఎంతటి జనమో గాలి ఆడనంత., సందు దొరకనంతమంది. అతికష్టం మీద స్టేషన్ దాటి రోడ్డుమీదకు వచ్చాం. తెల్లారలేదు. ఆకాశం మబ్బులు పట్టి, మసగ్గా ఉంది. “ ఇంకా ఎంత సేపు.. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి ”? “ నాకూ తెలీదు.. కనుక్కోవాలి. అందాకా ఓపికపట్టు..ఇదిగో ఈ గట్టువార కూర్చో, నేను ఇప్పుడే ఫోన్ చేసివస్తాను ” . ఆకాశం ప్రశాంతంగా ఉంది. గాలికి ఊగుతున్నాయ్ చెట్లు.., జనంలో కలిసి, అతను చూపుకు అందడంలేదు. ఫోన్ బాక్స్ ఎక్కడ ఉందో వెతకాలి కదూ.. నాకేం భయంగా లేదు. తను వస్తాడు. కానీ త్వరగా రావాలి. ఇలా ఒంటరిగా ఎదురుచూడటం చాలా కష్టంగా ఉంది. ఇద్దరు బిచ్చగాళ్ళు భుజం మీద సంచులతో నన్ను దాటుకువెళుతున్నారు. ఏంటో ఈ పరిసరాలు కాస్త ఇ...