పోస్ట్‌లు

2014లోని పోస్ట్‌లను చూపుతోంది

కినిగె పత్రికలో పెళ్ళి పంందిరి........

చిత్రం
ఈమధ్య వెళ్ళిన ఒక పెళ్ళిలో కలిగిన అనుభవాలను మ్యూజింగ్స్ రూపంలో ఇలా పంచుకున్నాను. http://patrika.kinige.com/?p=4573

వాకిలి పత్రికలో నాకథ బామ్మగుట్టు ప్రచురితమైంది.

చిత్రం
వాకిలి నవంబర్ సంచికలో నాకథ బామ్మగుట్టు ప్రచురితమైంది. http://vaakili.com/patrika/?p=6681 మిట్టమధ్యాహ్నం సూరీడు నడినెత్తిన ఉండి తన ప్రతాపాన్ని చూపిస్తున్న వేళ స్కూలు వదలగానే రోడ్డు మీద పడ్డాను మాసిపోయిన యూనీఫాంతో, అవ్వాయి చెప్పులేసుకుని. ఓపక్క ఆకలి, మరోపక్క వేడెక్కిన రోడ్డుమీద నడక, ఎంత తొందరాగా ఇంటికి వెళ్ళి అన్నం తింటానా అనే తొందరలో ఉన్నాను. సరిగ్గా మా గుడి సందు దాటుతుంటే, ఎత్తరుగు మీద ఇంటి చూరు కిందగా, కాళ్ళు బారజాపుకుని చేతి కర్రతో కాకుల్ని తోలుతూ వడియాలకు కాపలాకాస్తూ కూచునుంది సిద్ధేర్వరి బామ్మ. ఆకలి వల్ల కళ్లానక ఇలావచ్చేసాను. “చచ్చానురా దేవుడా… ఉత్తపుణ్యాన బామ్మకు పలారమైపోతానే” పక్కదారిగుండా పోకుండా ఎందుకు గుడి దారిన వచ్చానురా అనుకున్నాను. నేను తనను చూడక మునుపే బామ్మ తన గుడ్ల గూబకళ్ళేసుకుని నన్ను చూసేసింది. “ఏమిటే సుబ్బి ఇలా వస్తున్నావ్, ప్రసాదం కోసమేనా… అంత తిండియావ ఏమిటే… చదువు సంధ్యా ఏవన్నా ఉందేమిటే, ఇంత మిట్టమధ్యాహ్నపు వేళ ఏమిటే నీకు ఈవీధిలో పని… ఓ పక్కతెల్లారకుండానే గుడి దగ్గర వాలిపోతావు. దీపాలవేళా గుడి దగ్గరే ఉంటావు. ఇప్పుడెందుకు వచ్చావే… వేళ...

నాకథ లచ్చి కినిగే పత్రికలో ప్రచురితమైంది.

చిత్రం
నాకథ లచ్చి కినిగే పత్రికలో ప్రచురితమైంది. http://patrika.kinige.com/?p=3992 Add caption తనలో వయసుతో వస్తున్న మార్పులు నాకు తెలియవు. నాకు వయసొచ్చే నాటికి తను నా దగ్గరలేదు. బహుశా నాకు లచ్చి అందరికన్నా ప్రత్యేకంగా కనిపించడానికి ఆ వయసే కారణమేమో. చిన్నతనంలో ఎప్పుడూ నీడలా వెంటాడేవి తనని నా చూపులు. తను ఎక్కడికివెళ్ళినా వెంట వెళ్ళేదాన్ని. లచ్చికి నేరేడు పళ్ళంటే భలే ఇష్టం. నాలాంటి పిలకాయలందరినీ వెంటేసుకుని నేరేడు చెట్లదగ్గరకు తీసుకుపోయేది. పండిన పళ్లు మామూలుగా చెట్లకింద రాలేవి. కాని ఆ నేల పశువులు తిరిగేది కావడం వల్ల అవి బాగుండేవి కావు, పైగా అంతెత్తు నుండి పడి చితికిపోయేవి. అందుకోసం మాలో ఒకరిని వంతుల వారిగా చెట్టు ఎక్కించేది. ఎవరూ లేని రోజు తనే ఎక్కేసేది. అందిన మట్టుకు, పండిన మట్టుకు చెట్టు దగ్గరే తినేసి ఇంటికి చక్కా వచ్చే వాళ్ళం. అందరం బలే అల్లరి చేసేవాళ్ళం. మాకు నచ్చిన కాయా పువ్వూ ఏ దొడ్డో వున్నా దొబ్బుకొచ్చేయాల్సిందే అన్నట్టుండేది మాయవ్వారం. ఇళ్ళల్లో మా ఈపులు సాపైపోయినా మా అల్లరి అగేది కాదు. చిన్నపిల్లలం మాకు తగిలినట్టుగానే లచ్చికి కూడా ఇంట్లో ఆళ్ళమ్మ తెగ తన్నే...
చిత్రం
 జమీల్యా ప్రేమ కథపై సమీక్ష కినిగె పత్రికలో http://patrika.kinige.com/?p=3396

గుమస్తా మరణం

చిత్రం
నేను చేసిన మొదటి అనువాదం కినిగె పత్రికలో http://patrika.kinige.com/?p=3421 (ఆంటన్ చెఖోవ్ “డెత్ ఆఫ్ ఎ క్లర్క్” కు శ్రీశాంతి దుగ్గిరాల అనువాదం) ఒక మంచి సాయంత్రవేళ, అంతకన్నా మంచివాడైన ఆఫీసు గుమస్తా ఇవాన్ దిమిత్రిచ్ చెర్వియాకో నాటకశాల రెండవ వరసలో కూర్చుని ఒపెరాకళ్ళద్దాలలోంచి ప్రదర్శనలో లీనమైపోయి చూస్తున్నాడు. కానీ ఉన్నట్టుండి… ఈ “కానీ ఉన్నట్టుండి” అనే మాట కథల్లో తరచుగా వస్తుంది. రచయితలు చెప్పేది ముమ్మాటికి నిజం. మనిషి జీవితంలో ఉన్నట్టుండి జరిగే సంఘటనలు ఎక్కువే. కానీ ఉన్నట్టుండి అతని ముఖం ముడుచుకుంది, అతని కళ్ళు చక్రాల్లా గుండ్రంగా తిరిగాయి, అతని ఊపిరి నిలిచిపోయింది. చేతిలోని కళ్ళద్దాలను కిందకు దించి ముందుకు వంగుతూ “హాచ్…!” అంటూ తుమ్మాడు చర్వియాకో. తుమ్మటం అనేది ఏం నిషిద్ధం కాదు. ఎవరైనా ఎక్కడైనా తుమ్మచ్చు. రైతులు తుమ్ముతారు. కొన్నిసార్లు పోలీసు అధికారులూ తుమ్ముతారు, అంతెందుకు కౌన్సిలర్లు కూడా తుమ్ముతారు. మనుషులందరూ తుమ్ముతారు. చర్వియాకో ఈ పరిణామానికి ఏమీ ఇబ్బంది పడలేదు. చేతిరుమాలుతో తన ముక్కును మర్యాదపూర్వకంగా తుడుచుకున్నాడు. తర్వాత చుట్టూ చూసి తాను తుమ్మడం వల్ల ఎవ...

* నీ వెనక మాటలు *

చిత్రం
  చిరునవ్వులు ఒలకబోయకు చిత్రాలు జరుగుతాయని గుబులు నాకు ప్రాణంలో ప్రాణమవకు ఎప్పుడో జారిపోతావని భయం నాకు నీరుగారిన ఉత్సాహానికి ఊపిరి నీవౌతుంటే లోపలెక్కడో దిగులు అందకుండా ఆవిరైపోతావని ప్రేమ నిండిన నీ నిజాయితీ చూపులతో నువ్వు పలికే ప్రతి మాటా తూర్పుకాంతిలో వెలిగే పచ్చిక మీది బొట్టులా అనిపిస్తుంది నాకు. చిప్పిల్లే ప్రతి చుక్కకీ తెలుసు మనం జంటని, మనది నూరేళ్ళ పంటని. ఏలెక్కలూలేని ఉదయం మనది గడియారంతో పనిలేని పయనం మనది.

నా మూడో కథ "వేపచెట్టు" కినిగె పత్రికలో

చిత్రం
ఇక్కడ చదవండి. ఆ ఇంట్లోకి మేం అద్దెకొచ్చి పదేళ్ళు పూర్తయ్యాయి. ఏడాదిలో ఓసారి ఆకస్మిక తనిఖీ చేసి వెళుతుంది మా ఇంటి ఓనరు ఆదిలక్ష్మిగారు. ఆ ఏట ఇంటి మరమ్మత్తులేమన్నా ఉంటే చేయించేసి వెళుతుంది. మనిషి చాలా మంచిది, జాలీ, ప్రేమా ఎక్కువే. కాస్త అమాయకురాలు కూడాను. ఎవరేం చెప్పినా ఇట్టే నమ్మేస్తుంది. నెలనెలా అద్దె మాత్రం రమణమూర్తి అని ఆదిలక్ష్మిగారి దూరపు బంధువు వసూలు చేస్తాడు. ఈ మనిషి పైకి కనిపించినంత మంచోడేంకాదు. ఆదిలక్ష్మిగారికి ఈ ఊళ్ళో ఆస్తులు చాలానే ఉన్నాయి. ఆమెకి అద్దె ఓ లెక్కకాదు. రమణమూర్తి అది అలుసుగా తీసుకుని సంవత్సరం వసూలు చేసిన అద్దెనంతా తన దగ్గరే ఉంచుకుని వడ్డీకి తిప్పుతాడు. ఆవిడొచ్చే సమయానికి జమవేస్తూ ఉంటాడు. పైకి మా అందరితో “ఈ చాకిరీ ఎవరు చేస్తారు. నాకా వయసైపోతుంది. ఆదిలక్ష్మిగారు రాగానే అన్నీ అప్పగించేస్తాను” అంటూ తెగ రాగాలు తీస్తాడు. ఈ పదేళ్ళమట్టీ మాకా మాటలు వినీ వినీ అలవాటైపోయాయి. మేమాఇంట్లో దిగేటప్పటికి ఓ మొక్క కూడా ఉండేది కాదు. నాకు మొక్కల్లేకపోతే ఊపిరాడనట్టు ఉంటుంది కాబట్టి వచ్చిన ఏడాదిలోనే గేటువారగా ఇరుపక్కలా ఓ పసుపుపువ్వుల చెట్టు, పారిజాతం, ఆపైన నూతివారగా అరటి...

స్త్రీ లోకపు వెలుగు నీడలు : ఇస్మత్ చుగ్తాయ్ కథలు

చిత్రం
పి. సత్యవతి గారి అనువాదంలో ఇస్మత్ చుగ్తాయ్ కథలు చదివాకా నా అభిప్రాయాన్ని కినిగె పత్రికలో క్లుప్తంగా చెప్పాను. చదివి మీ అభిప్రాయం చెప్పండి. మీరూ చుగ్తాయ్ కథలు చదవండి. లింక్ ఇదిగో:-- స్త్రీ లోకపు వెలుగు నీడలు : ఇస్మత్ చుగ్తాయ్ కథలు ఒక రచయిత గురించి చెప్పాలంటే రచయిత వ్యక్తిగా ఎవరో తెలిస్తే కాస్త బాగా చెప్పగలుగుతాం. కానీ ఏమీ తెలియకపోయినా చుగ్తాయ్ కథలే ఆమె గురించి చాలా చెపుతాయి. ఆమె కథావస్తువులు, ఆలోచనలు అన్నీ ఆమె జీవితంలో నుండి పుట్టినవే. ఏ చిన్న విషయాన్నయినా ఆమె కథగా రాయగలరని ఈ పుస్తకం నిరూపిస్తుంది. బేగమ్‌ జాన్‌, కుబ్రాతల్లి, కుబ్రా, ఆమె చెల్లీ, రుక్సానా, హలీమా, గోరీబీ, సరలాబెన్‌, బిచ్చూ అత్తయ్య, వదినె, షబ్నమ్‌, ఇల్లూడ్చే ముసలమ్మ, ఫర్హత్‌… ఇలా పాత్రలన్నీ ఆమె పెరిగిన, ఎరిగిన వాతారరణంలో నుండి వచ్చినవే. చెప్పాలనుకున్నది సూటిగా, నిక్కచ్చిగా చెప్పడం చుగ్తాయ్ కథల ప్రత్యేకత. ఆమె ఈ కథలు రాసింది ఉర్దూలోనే అయినా తెలుగులోకి భావం ఏ మాత్రం చెడకుండా వచ్చింది. దీనికి అనువాదకురాలు పి. సత్యవతిగారి ని అభినందించాలి. అన్నీ స్త్రీ చుట్టూ తిరిగే కథలే ఐనా ఏ కథా మరో కథలా ఉన్నట్టు అనిపించ...

కర్కశత్వాల మధ్య కమలిన సాత్వికత: మూలింటామె

చిత్రం
                                                                                                                                                                                                                                                                          మూలింటామె నవల చదువుతున్నంత సేపు ఏదో ఆశక్తి చివరకు ఆమె వస్తుందా...

సాయంకాలమైంది పుస్తకం పై నా రివ్వూ

చిత్రం
మనిషి తన జీవితాన్ని ఎంత గొప్పగా జీవించాలని ప్రణాళికలు వేసుకున్నా, తనకు జీవిత చరమాంకలో ఓ ఆలంబన అనుకున్న బంధాలు వేసే ఉచ్చులో పడక తప్పదు. తాను విధించుకున్న నియమాలను కడదాకా నిలపడం కోసం బిడ్డలను సైతం వదులుకున్న సుభద్రాచార్యులు కథే సాయంకాలమైంది. మరపురాని పాత్రలతో క్రి క్కిరిసిన సాయంకాలమైంది. గొల్లపూడి మారుతీరావు నాకు సినిమాలపరంగా మంచి నటులుగా తెలుసునే కానీ, ఆయనలోని రచయితను తొలిసారి “ సాయంకాలమైంది ” నవలలోనే పరిచయం చేసుకున్నాను. శ్రీ వైష్ణవ సాంప్రదాయాన్ని పాటించడంలో తరాలు మారుతున్న కొద్ది వస్తున్న మార్పుని ఈ నవల్లో చూపించారు రచయిత. ఈ కథ నాలుగు తరాలను మనకు పరిచయం చేస్తుంది. పద్మనాభం అనే ఊరిలో ఆలయపూజారులైన సుభద్రాచార్యులవారి అంత్యక్రియలతో కథ ప్రారంభం అవుతుంది. ఆయన కొడుకు తిరుమల అమెరికా నుంచి తండ్రి అంత్యక్రియలకై ఊరికి వస్తాడు. కథ మొత్తం సుభద్రాచార్యులవారి చుట్టూ తిరుగుతుంది. కుంతీనాథాచార్యులు కొడుకు పెద్ద తిరుమలాచార్యులు, ఆయన కొడుకు సుభద్రాచార్యులది మూడవతరం. నాలుగవతరం వాడు చినతిరుమలాచార్యులు (తిరుమల). పూర్వీకులంతా వైష్ణవ సాంప్రదాయాన్నీ, ధర్మ జ్యోతిష తర్కశాస్త్రాల...

కినిగె పత్రికలో నా కథ "మీసాలోడు"

చిత్రం
ఈ మీసాలోడు నిజంగా ఉన్నాడు. చిన్నప్పుడు మా ఇంటి ఎదురుగా ఉండేవాడు. కథలో జరిగిన చాలా విషయాలు నిజంగా జరిగినవే. మరీ కథలో అంత కాదు గానీ, మా అమ్మ కూడా అంతే. ఇలా నాకు ముఖపరిచయం మాత్రమే ఉన్న మీసాలోడు ఒక కథగా మారతాడని అంతకుముందెప్పుడూ అనుకోలేదు. అతని హత్య జరిగిన తర్వాత నిజంగానే నేను కథలో జరిగినట్టే ఫీలయ్యాను. కథని మగ పాత్రతో ఎందుకు చెప్పించానో నాకూ తెలీదు. కథ చదివి మీ అభిప్రాయం చెప్తే సంతోషిస్తాను. మీసాలోడు కథ ఇక్కడ చదవండి. తెల్లవారుజాము నాలుగున్నరకు నాగదిలో అలారం మోగింది. అప్పటికే కలతనిద్రలో ఉన్నానేమో ఆ మోతతో మెలుకవ వచ్చేసింది. ఓ సంవత్సరంగా నాకు ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగింది లెండి. అంటే నావయసు ఏ అరవయ్యో అనుకునేరు, ముప్ఫయ్యే. ఇంకా పెళ్ళి కాలేదు. కోడలు రావాలని అమ్మకు ఎంత ఉన్నా, నాకు మాత్రం ఈ బ్రహ్మచారి జీవితమే బాగుంది. ఏదో వంకచెప్పి ఇంకొన్ని రోజులు ఇలా కానిచ్చేద్దామనే ఉంది. ఈ మధ్య నేనూ – నా ఆరోగ్యం అనే ప్రాతిపదికన రోజూ ఉదయాన్నే వాకింగ్ మొదలెట్టాను. ఆరోగ్యం సంగతి ఎలా ఉన్నా నడక తరువాత అలసిన శరీరానికి చక్కని వేడినీటి స్నానం, మంచి ఫలహారం తరువాత పట్టే నిద్ర ఉంది చూసారూ ఆ సౌఖ్యాన్ని వర్ణి...

అమరావతి కథల పై సమీక్ష

చిత్రం
సత్యం శంకరమంచి "అమరావతి కథలు" పై నా సమీక్ష కినిగె పత్రికలో .  “అల్లంత దూరాన మబ్బుల్ని తాకుతున్న గాలిగోపురం. ఆ వెనుక సూర్యకిరణాల పలకరింపుకు మెరుస్తున్న బంగారుపూత అమరేశ్వరాలయ శిఖరం. ఎత్తయిన ఆ శిఖరానికి చుట్టూతా ఎన్నో ఆలయాలు. ఎన్నెన్నో శిఖరాలు. తూర్పున వైకుంఠపురం కొండ, దక్షిణాన పాడుపడ్డ బౌద్ధ స్తూపాలు, పడమట ఈనాడు దిబ్బగా మారిన అల్లప్పటి శాతవాహనుల రాజధాని ధాన్యకటకం, ఉత్తరాన ఆ స్తూపాల్ని, ఆ దిబ్బల్ని వాటిమధ్య ఉండే ప్రజల్ని, ఆ ఊర్ని వడ్డాణంలా చుట్టి గల గల పారుతున్న కృష్టానది. అద్గదీ అమరావతి.” అమరావతి కథలు సత్యం శంకరమంచి రచించిన 100 కథల సంపుటి. సత్యంగారి రచనకు బాపూ గారి బొమ్మలు, ముళ్ళపూడి వెంకట రమణగారి ముందు మాట మరింత వన్నెతెచ్చాయి. ఈ కథల్లో తనకు పరిచయమున్న ఊరిని, ఊరివారినీ మనకు పరిచయం చేసారు. కథ నిడివి చిన్నదైనా కథ చెప్పిన తీరు, కథా   విషయం నిరాడంబరంగా ఉంది. అమరావతి ఊరితో ఆయనకున్న అనుబంధం ప్రతీ కథలోనూ కనిపిస్తుంది. రాజులు, దొరలు, దొంగలూ, సామాన్య ప్రజలూ, అందరూ కథా పాత్రలే. ఒకింత హాస్యము, వ్యంగ్యమూ కలబోసి చెప్తారు. ప్రతీ కథా క్లుప్తంగా, సూటిగా, మనసుకు హత్తుకునే విధంగా ఉం...