గమ్యం తెలియని పాత్రల పయనం "హిమజ్వాల"
హిమజ్వాల నవల వడ్డెర చండీదాస్ రచించారు. కథ ప్రారంభంలో గజి బిజిగా అనిపించింది. నెమ్మదిగా పాత్రల స్వభావాలను అర్థం చేసుకుంటూ కథలోని ఉద్దేశాన్ని తెలుసుకోడానికి పూర్తిగా చదివాను. ఈ కథ మనిషి మనసు ఎన్ని రకాలుగా మారుతుందో ఎలాంటి నిర్ణయాలను తీసుకునేలా చేస్తుందో తెలుపుతుంది. కృష్ణచైతన్య, గీతాదేవి అనే పాత్రల చుట్టూ నడుస్తుంది కథ. కథావిషయం:— ఉన్నతమైన కుటుంబానికి చెందిన కృష్ణచైతన్య కాలేజీ లెక్చరర్. ఒకనాడు రోడ్డు మీద అతనికి అపస్మారక స్థితిలో తారసపడుతుంది గీతాదేవి. ఆమెది మధ్యతరగతికి కుటుంబ నేపథ్యమైనా ఉన్నత చదువులు చదివింది. ఒంటరిగా ఉన్న అతనికి మొదటిసారిగా ఆమెపై కలిగిన అనురాగం ఆరాధనలను ప్రేమ పూర్వకంగా కాక కోరికగా తెలుపుతాడు. అతని నుండి ఆమె దూరంగా వెళిపోతుంది. బొంబాయిలో ఉన్న స్నేహితురాలి దగ్గరకు చేరుతుంది. అక్కడ స్నేహితురాలి భర్త ఆమెను వేధించటంతో, చివరకు కృష్ణచైతన్య స్నేహితుడైన శశాంక్ సహాయంతో ఒక పత్రికలో చేరుతుంది. కొన్నాళ్ళకు లెక్చరర్ గా స్థిర పడుతుంది. అక్కడే శివరాం తో పరిచయం అవుతుంది. ఆ పరిచయం కొన్నాళ్ళకు ప్రేమగా మారి పెళ్ళికి దారితీస్తుంది. అతనితో కొత్తజీవితం కొన్నాళ్ళు సరదాగా సాగు...
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి