నిశ్శబ్దం పుట్టింది...

 

తగలబడుతున్న కలల కోటల

మధ్య లోహపు ప్రేమలు 

నవ్వుతూ నిలబడ్డాయి

వెక్కిరింపుగా

మిట్ట మధ్యాహ్నపు వేళ

మ్రోగుతున్న గంటల సాక్షిగా

సగం తెగిపడిన గుండెలో

నిశ్శబ్దం పుట్టింది.

నువ్వు ఎర్రగా మండిన ప్రతిసారీ

ప్రేమంతా ఆవిరై ఆకు చివర 

నీటి బిందువులా అంటుకుంది.

పగుళ్ళిచ్చిన నేల నెరల్లో దూరి

జ్వలిస్తున్న బాధను పెకిలించకు

అప్పుడే ఈ వేదనంతా 

గోతిలో కప్పబడుతుంది.. 

రగులుతున్న కోరికల్లే మళ్ళీ 

పుట్టుకొస్తుంది..


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

పంచాయతీ మెట్లు

గమ్యం తెలియని పాత్రల పయనం "హిమజ్వాల"

అల్లం శేషగి రావు కథ "చీకటి"