అల్లం శేషగి రావు కథ "చీకటి"
“చీకటి”... ఇది ఇంత అందంగా ఉంటుందని నాకు తెలీదు. నా మనసుకు హత్తుకున్న ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది ఈ కథ. నేను ఈ మధ్య చదివిన కథల్లో వర్ణనలతో కూడినది, మేధస్సుకు పదును పెట్టే శైలితో నన్ను ఆకట్టుకున్నదీ ఈ కథ. ఇది ఇద్దరి వ్యక్తులకు మధ్య జరిగే సంభాషణ. వారిలో ఒకరి జీవితంలో జరిగిన సంఘటనల సమాహరం. ప్రతీ మనిషికీ ఒక కథ ఉంటుంది. అది చెప్పుకునే సందర్భాలు చాలా తక్కువగా వస్తాయి. అది ఎవరికి చెప్పాలో కూడా మనం నిర్ణయించుకోం. కానీ కాలగమనంలో మనకు తారసపడే వ్యక్తులలో మనసుకు నచ్చిన వారితో సందర్భానుసారంగా మన జీవితాన్ని ఆవిష్కరించుకోవడం జరుగుతుంది. ఎవరు గొప్పా, ఎవరు తక్కువ అన్నది చూపకుండా ఇద్దరినీ స్నేహితులుగా చూపుతూ, చదువుతోనే రాని, లేని జ్ఞానాన్ని చూపుతూ కథ నడిపిన తీరు నాకు నచ్చింది. ప్రకృతిని ఇష్టపడే వ్యక్తులు చాలామందే ఉంటారు, కానీ చీకటిని ఇష్టపడేవారు చాలా తక్కువ. మన లోకం వెలుగు ఉన్నంత వరకే. కానీ దీపం వెలుతురు లేని చీకట్లోనూ అందం ఉందని ఈ కథ చెప్తుంది. పాఠకుడు ఈ కథ చదువుతున్నపుడు తన మదిలో ప్రతీ దృశ్యాన్నీ ఆవిష్కరించుకోవడం జరుగుతుంది. ప్రతీ దృశ్యం మన ముందే జరుగుతుందనే మాయాజాలం చేయటం రచయిత గొప్పదనం....
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి