Tuesday, 23 May 2023

ఈ పాటతో గతానికి బదిలీ

 జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై... 
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై...
నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై... 
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై...


ఈ పాట నిన్నటి నుంచి తరుముతోంది. జీవితం వేసిన సంకెళ్ళను తెంచుకుని వచ్చేట్టు చేసిన పాటిది. జీవితమాధుర్యాన్ని పంచుకున్న పాట. అతని పిలుపు అతని ప్రేమ, విరహం అన్నీ కలగలిసి నన్ను నీవైపుకు లాగిన పాట. నీ పిలుపుకు మనసూరుకోక రాలేక పరుగెత్తుకొచ్చిన రోజులు.



ఈపాటే నన్ను పడుచుదాన్ని చేసి, బ్రతుకుమీద ఆశ కల్పించింది. ఈ పాటే నిన్ను చేరుకునేంత దాకా నన్ను తరిమింది. గాలికి ఊగిన చెట్ల కొమ్మల చివరన నా కోరికలను కట్టి ఎగురుతూ వచ్చేట్టు చేసింది ఈపాటే. నీరుగా పారే గుణాన్ని, నిప్పులా కురిసే ఉత్తేజాన్ని నీతో బ్రతుకుని ఇచ్చిందంటే ఈపాట వేసిన వలపు వలే కారణం. పాట వస్తున్నంత సేపు మనసు పరవశించిపోయేది. పరవళ్ళు తొక్కేది. గతాన్ని ఉండలా చుట్టి నాముందు పెట్టే శక్తి ఒక్క ఈ పాటకు మాత్రమే ఉంది. మనసుకు తెరలు తొలగించే లోతు ఈపాట సొెంతం. 

ఆకుల్ని రాలుస్తూ చెట్టు నవ్వుతోంది. 
కరెంట్ తీగెలకు వేలాడుతున్నాయి చూపులు...
వేళ్ళ చివర విషాదాన్ని మోస్తూ ఊహలు, ఊసులు.., 
నన్ను హఠాత్తుగా కప్పేస్తున్న భయం నుంచి పుట్టుకొచ్చిన కలల పూలు.. (శ్రీ)

No comments:

Post a Comment

నీలోకి ఒలికిపోయాననీ..

ఈరోజుకి రాసే ప్రేమలేఖ ఇది..  కొన్నిసార్లు అనిపిస్తుంది.  నేను నీలోకి ఒలికిపోయాననీ..  నీలోకి వచ్చి చేరాకా హృదయంలోని నిశ్శబ్దానికి...