కల....



పాతబడిన జ్ఞాపకాల
సంతలో పరచబడ్డ గురుతులెన్నో
కొన్ని రోజులు..కొన్ని క్షణాలు
అన్నీ జ్ఞాపకాలే..
మెరిసి మాయమయ్యే కలల
మధ్య మలినం లేని నీ ఊహ
ఊపిరై హత్తుకుంటుంది.
ఎన్నెన్ని పదునైన చూపులో
బిగించి పట్టుకున్న కౌగిళ్ళు..
ఎంగిలి ముద్దుల కవ్వింపులు
దీపాల వెలుగు జిలుగుల్లో
తడబడి సాగే నీ ఛాయను
దగ్గర చేసుకుంటూ...
మబ్బుల్ని కప్పుతూ
మూల్గుతూ శోక జీరను
కళ్ళకు వదిలి మాయమవుతుంది కల.
లోలోన రహస్యాల్ని తోడుతూ
రెక్కల్ని కొట్టుకుంటూ ఆకాశం వైపు
ఎగిరిపోతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గమ్యం తెలియని పాత్రల పయనం "హిమజ్వాల"

అల్లం శేషగి రావు కథ "చీకటి"

పంచాయతీ మెట్లు