నిరీక్షిస్తూ..
రాతిరి అంటుకుని ఆరిపోయిన కోరికలా కరిగి నీరైన చిరునవ్వుతో నిరీక్షిస్తాను నీకోసం. మంచు కురిసిన ఉదయం వెచ్చగా మారిపోయేంతదాకా అపుడే కాలం దూరంగా నెట్టివేసిన ప్రేమలా కలలెన్నో పూసి చిగురు కొమ్మలను చేరతాయి. రాత్రి వెలుగు నీడల్లో ఒంటరితనం శాపమైన వేళ నీ ప్రేమ మత్తెక్కిస్తుంది. రంగుల పొలిమేరల్లో మబ్బుల వెన్నెల పొర్లాడుతూ నిన్ను చేరుతుంది. ఆ క్షణాలన్నీ రాలిపోయాకా అనేక శరత్తుల దాకా నీకోసం నిరీక్షిస్తూ.. చీకటి దుప్పటిలో ముఖం దాచుకుంటాను.