విముక్తి...

ఎగిరే పక్షి స్వేచ్ఛను దొంగిలించాలనిపిస్తుంది పారే నది పరవళ్ళు ఎత్తుకుపోవాలి ఉరకలేసే లేగదూడతో స్నేహం చేయాలి ఊరంతా తిరిగిచూపే రంగుల రాట్నానై పోవాలి రాలిన స్వప్నరాగాల ముందు విరాగినైపోయి కలల తీరాలను నెట్టేసి చినుకు తెరల మాటున ఉరుమునైపోవాలి భయాల చెట్టుకింద నిద్రపోయి రోగాన్ని విదిలించుకుంటున్నాను. వారాలు నెలలు చుట్టాలైపోయాయి నీడలన్నీ వాదులాడుతున్నాయి విముక్తి కోసం వెంపర్లాట